👉 ₹ 11వేల 116 కు దక్కించుకున్న లక్ష్మా రెడ్డి !
J SURENDER KUMAR,
జగిత్యాల ప్రెస్ క్లబ్ భవనంలో ఏర్పాటుచేసిన గణపతి లడ్డు కోసం పోటాపోటీగా జర్నలిస్టులు వేలంలో పాల్గొన్నారు. గత ఏడాది క్లబ్ సభ్యుడు అన్వర్ ₹11 వేల 111 రూపాయలకు లడ్డును దక్కించుకొగా బుధవారం జరిగిన వేలంలో మన తెలంగాణ రిపోర్టర్ పన్నాల లక్ష్మణ్ రెడ్డి ₹ 11 వేల 116 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు లడ్డు గ్రహీత లక్ష్మా రెడ్డిని సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
ప్రెస్ క్లబ్ నిర్మాణం తర్వాత గత సంవత్సరం గణపతిని ఐదు రోజుల పాటు పూజించి వారి ఆశీస్సులతో ద్వితీయ సంవత్సరం కూడా గణపయ్యను పూజించుకునే అవకాశం రావడం జర్నలిస్టుల అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
జర్నలిస్టుల ఐకమత్యాన్ని చాటుతూ ప్రతి సంవత్సరం గణపతి ని పూజించుకుందామన్నారు. అంతకుముందు ప్రెస్ క్లబ్ గణపతికి జగిత్యాల డిఎస్పి రఘు చందర్, సీఐ కరుణాకర్, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, పారిశ్రామికవేత్త కొండ లక్ష్మణ్, సీనియర్ పాత్రికేయులు రంగారావు, మేడిపల్లి వేణు తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ, సహాయ కార్యదర్శులు గుర్రం చంద్రశేఖర్, కోరేపు రాజ్ కుమార్, చింత నరేష్, ఉత్సవ కమిటీ సభ్యులు బొడ్డుపల్లి అంజయ్య, సీనియర్ పాత్రికేయులు ఎల్లాల రాజేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, మల్లారెడ్డి, అలిశేట్టి మదన్ మోహన్, ,సఫీ ఉద్దీన్, హైదర్ అలీ, హనుమంతు పటేల్, లక్ష్మణ్, సట్ట శ్రీనివాస్, రాజిరెడ్డి తో పాటు గాజుల శ్రీనివాస్, హరీష్, పిట్టల శ్రీనివాస్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
👉 ఘనంగా నిమజ్జనం !
ప్రెస్ క్లబ్ లో పూజలందుకున్న గణపయ్య నిమజ్జనం వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో శోభాయాత్ర తహసీల్ చౌరస్తా వద్ద నుండి టవర్ మీదుగా చింతకుంట చెరువు వరకు కొనసాగింది.

జర్నలిస్టులు ఏకరూప దుస్థులు ధరించి డప్పుల చప్పుల్లతో ఉత్సాహంగా, భక్తి పారవశ్యంలో నృత్యాలు చేస్తూ తీసుకువెళ్లి వినాయకున్ని చెరువులో నిమజ్జనం చేశారు.

నిమజ్జన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ, సహాయ కార్యదర్శులు గుర్రం చంద్రశేఖర్, కోరేపు రాజ్ కుమార్, చింత నరేష్, ఉత్సవ కమిటీ సభ్యులు బొడ్డుపల్లి అంజయ్య, సీనియర్ పాత్రికేయులు ఎల్లాల రాజేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, మల్లారెడ్డి, అలిషెట్టి మదన్ మోహన్, షఫీ హనుమంతు పటేల్, లక్ష్మణ్, సట్ట శ్రీనివాస్, రాజిరెడ్డి తో పాటు గాజుల శ్రీనివాస్, హరీష్, పిట్టల శ్రీనివాస్, గాజుల మహేష్, కడర్ల రంజిత్, భరత్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.