జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా కరీంనగర్ పోలీస్ గ్రౌండ్ లో..

J SURENDER KUMAR,

కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం  నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ముందుగా మంత్రి  తెలంగాణ అమరవీరుల కు నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం జరిగిన సభలో ప్రసంగిస్తూ, ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని వివరించారు.

ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలను సమానంగా అభివృద్ధి ప్రధాన ప్రవాహంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తోందని, ప్రజల భాగస్వామ్యం ద్వారానే రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్  అన్నారు.