J SURENDER KUMAR,
జగిత్యాల కలెక్టరేట్ లో ప్రజా పాలన దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ ముఖ్యతిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బీసీ కమిషన్ చైర్మన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అధికార అనధికారులకు ప్రజా పాలనా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ బి. ఎస్. లత లు కలిసి రాష్ట్ర బీ. సీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ గారికి పూల మొక్క అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా సాధించిన ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్లు బి. ఎస్. లత, రాజా గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.