J.SURENDER KUMAR,
అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం, జర్నలిస్టుల అనేక సమస్యలు, పెండింగ్ అంశాలపై మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి సంబంధిత సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపారు.
మంత్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హోం శాఖ కార్యదర్శి, ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యదర్శి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్, కార్మిక శాఖ కమిషనర్, ముఖ్యమంత్రి చీఫ్ పి ఆర్ ఓ,లు ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అక్రిడియేషన్ల జారీ, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, త్రిపాఠి పేజ్ బోర్డు కమిషన్ అమలు, జర్నలిస్టులపై దాడుల నివారణకు అత్యున్నత కమిటీ ఏర్పాటు, ప్రభుత్వ పక్షాన జర్నలిస్టులకు అవార్డులు తదితర అంశాలపై విస్తృతస్థాయిలో చర్చ జరిగాయి. వారం రోజుల వ్యవధిలో రెండవ ఈ సమావేశం రెండవది. అతి త్వరలో జరుగనున్న మరో సమావేశంలో తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోనున్నది.