కాళోజీ పురస్కారానికి రమాదేవి ఎంపిక !

👉 అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన కవయిత్రి, రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవికి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అభినందనలు తెలిపారు

👉 ప్రజాకవి, పద్మ విభూషణ్  కాళోజీ నారాయణరావు  పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకమైన ఈ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ  అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ 2025 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవిని ఎంపిక చేసింది.

👉 కమిటీ ఎంపికను ఆమోదించిన ముఖ్యమంత్రి  రమాదేవికి అభినందనలు తెలిపారు. సెప్టెంబర్ 9,  2025 రవీంద్రభారతిలో జరిగే కాళోజీ జయంతి వేడుకలలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.

.