👉 మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
కల్వకుంట్ల కుటుంబంలోని కలహాలకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ? కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడం కాదు కదా గాంధీభవన్ మెట్లు ఎక్కనివ్వం అని మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 ఎమ్మెల్సీ కవిత బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ, హరీష్ రావు, సంతోష్ రావు, ఆ పార్టీ తీరుపై కాలేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర పై ఆమె మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలపై మీడియా అడిగిన అంశాలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పందించి మాట్లాడారు.
👉 2014 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం అవినీతి చరిత్ర గూర్చి ప్రజలకు తెలుసు అన్నారు.
👉 కాలేశ్వరం ప్రాజెక్టులో లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి పినాకిని ఘోష్ కమిషన్ తమ విచారణలో నిర్ధారించింది అని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
👉 ఘోష్ కమిషన్ కాలేశ్వరం ఎవరు ఎంత దోచుకున్నారు, విషయం స్పష్టం కావడంతో కవిత గగ్గోలు పెడుతూ కాంగ్రెస్ పార్టీపై బట్ట కాల్చి మీద వేయడం వారికి అలవాటు గా మారింది అని మంత్రి అన్నారు.
👉 మా ముఖ్యమంత్రి, హరీష్ రావు ఒకే విమానంలో వెళ్లారు అని ఆరోపిస్తున్న కవిత ఆరోజు ఎందుకు ఈ విషయం బయట పెట్టలేదని ప్రశ్నించారు.
👉 తెలంగాణ యాశాభాష తో ఓ అబద్దాన్ని పదిసార్లు చెప్పుతూ నిజం అనిపించేలా చూపించే కళ భగవంతుడు వారికి ఇచ్చాడాని మంత్రి అన్నారు.
👉 పది సంవత్సరాలు బిఆర్ఎస్ పాలనలో కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవితా రావు మీరే పాలించారు అని మంత్రి అన్నారు.
👉రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాకు మంత్రులుగా అవకాశం లభించిందన్నారు.
👉 మీ కుటుంబ ఆస్తుల, అక్రమ సంపాదన, పదవుల పంపకాలలో మా కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం నీకు తగదు చెల్లె కవితమ్మ అంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.