కాపు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజేష్ నియామకం !

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం కు చెందిన  బొంగురాల రాజేష్ ను మున్నూరు కాపు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. జగిత్యాల జిల్లా అధ్యక్షులు మొగిలి సతీష్  అధ్యక్షతన ధర్మపురి పట్టణంలో జరిగిన జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు.

మున్నూరుకాపు యువత రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ పటేల్  మరియు మున్నూరు కాపు యువత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాద క్రాంతి  రాజేష్ తో పాటు మున్నూరు కాపు యువత రాష్ట్ర కార్యదర్శులుగా  సాట్లపల్లి శ్రీధర్ పటేల్ గరుబ్,  గుర్రం సమ్మయ్య పటేల్, మున్నూరు కాపు యువత జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి  పూదరి పవన్ పటేల్ , బుగ్గారం మండలం మున్నూరు కాపు యువత మండల అధ్యక్షుడిగా  సుంకం ప్రశాంత్ పటేల్, బుగ్గారం పట్టణ మున్నూరు కాపు యువత అధ్యక్షులుగా భారతం గంగాధర్ పటేల్ , తదితర గ్రామ శాఖ కమిటీలను ఈ సమావేశంలో తీర్మానించారు.

ఈసమావేశానికి ముఖ్య అతిథులుగా కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  వన్నమల ప్రవీణ్ కుమార్ పటేల్  మరియు మున్నూరు కాపు యువత సంఘం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్  చింతపండు మహేందర్ పటేల్  మరియు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు  ఇమ్మిడిశెట్టి మోహన్ పటేల్  మున్నూరు కాపు యువత జిల్లా ఉపాధ్యక్షులు పూదరి రమేష్ పటేల్ , ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి  సోమేశెట్టి రమేష్ పటేల్  తదితరులు పాల్గొన్నారు అనంతరం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్నారు.