కష్టజీవులు గౌడ్ అన్నల ప్రమాద రక్షణకే కాటమయ్య కిట్లు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR

ప్రమాద అంచున కుల వృత్తుల నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్న గౌడ్ అన్నల ప్రమాదాల బారిన పడకుండా రక్షణ కోసం ప్రభుత్వం కాటమయ్య కిట్లు పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

బుగ్గారం మండలంలో శనివారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ముందుగా మండల కేంద్రంలో నడిబొడ్డున గల గడిలో ఏర్పాటు చేసిన దుర్గా మాతా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి లక్ష్మణ్ కుమార్,

అనంతరం, గ్రామ పంచాయతీ వద్ద జరిగిన కటమయ్య కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గౌడ సోదరులకు కిట్లను పంపిణీ చేశారు.

అనంతరం ₹ 20 లక్షల రూపాయల వ్యయంతో పురాతన గడి స్థలంలో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.