J.SURENDER KUMAR,
అంధులైన విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లాలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన అంధ విద్యార్థులు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు సంగీత వాయిద్య పరికరాలను అందించారు. విద్యార్థులు ఆలపించిన పాటలతో రూపొందించిన సీడీని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , జీహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి , కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.