క్రీడలు లక్ష్యసాధనకు పట్టుదల పెంచుతాయి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

క్రీడా పోటీలలో గెలుపు ఓటములు సహజమే అయినా, స్నేహభావంతో పాటు జీవితంలో లక్ష్యసాధనకు  విద్యార్థులలో పట్టుదలను పెంచుతాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట్ మండలం  మరిమడ్ల గ్రామంలో  శనివారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల రాష్ట్ర స్థాయి క్రీడలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అది శ్రీనివాస్, సెక్రటరీ సీత మహా లక్ష్మీ , జిల్లా కలెక్టర్ తో  కలిసి ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...

రాష్ట్ర ప్రభుత్వం విద్యతోపాటు, క్రీడలకు వేల కోట్ల నిధులు కేటాయించిందని, మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థుల లో ప్రతిభను గుర్తించడానికి క్రీడ పోటీలు నిర్వహిస్తున్నదని మంత్రి అన్నారు.


ప్రతిభ గల క్రీడాకారులను  జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడానికి ఆర్థిక సహాయంతో పాటు శిక్షణ ప్రోత్సాహాన్ని ఇస్తున్నామన్నారు.


జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫలితాలు సాధించిన క్రీడాకారులకు నగదు బహుమతితో పాటు ఇంటి స్థలాలు ప్రభుత్వ గ్రూప్ ఉద్యోగాలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సహించిన విషయాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు వివరించారు
.