కృత్రిమ మేధస్సు పట్ల విద్యార్థులకు అవగాహన చర్యలు !

👉 మంత్రి డి.శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,

కృత్రిమ మేధస్సు పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని  రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. గురువారం   మంత్రి   శ్రీధర్ బాబు,   కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి  ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్, ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఎల్ఎంఎస్ పుస్తకాల పంపిణీ, టి ఫైబర్ ద్వారా గ్రామానికి ఏర్పాటుచేసిన సీసీటీవీ ను ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ….

అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ప్రతి ఇంటి వద్ద టి ఫైబర్  కనెక్షన్ అందించడం జరిగిందని అన్నారు.   పాఠశాలలో ఏఐ ల్యాబ్ ద్వారా ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందుతుందని అన్నారు.

హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మారుమూల ముత్తారం ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యం కల్పించేందుకు ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

భవిష్యత్తులో వచ్చే సాంకేతికతను అలవాటు చేసుకుంటూ పోటీ ప్రపంచానికి విద్యార్థులను సిద్ధం చేయాలని అన్నారు.
మంథని నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో డిజిటల్ క్లాస్ లను ఏర్పాటు చేయాలని, దీని కోసం సిఎస్ఆర్ నిధులు వినియోగిస్తామని అన్నారు. రోబోటిక్స్, డ్రైవర్ లెస్ కార్లు వంటి సాంకేతిక అంశాలు పిల్లలకు నేర్పాలని అన్నారు. మంథని లో ఉన్న ప్రోటో టైపింగ్ ఇన్నోవేషన్ సెంటర్ ను  విద్యార్థులు వాడుకోవాలని మంత్రి సూచించారు.

ఏఐ టూల్స్ (కృత్రిమ మేధస్సు) పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందని అన్నారు. టీచర్స్ కు కూడా ఏ.ఐ బోధన  పై శిక్షణ అందిస్తామని అన్నారు.   పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్ రావాల్సిన అవసరం ఉందని, దీని కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసింగ్ అందజేశారు. మరియు అడవి శ్రీరాంపూర్ గ్రామపంచాయతీ లోని టీ ఫైబర్ ద్వారా హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానమైన టెక్నాలజీని ప్రారంభించారు.

అంతకుముందు ముత్తారం మండలంలోని దర్యాప్పూర్ వద్ద ₹2 కోట్ల 80 లక్షల, పోతారం వద్ద ₹2 కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న సబ్ స్టేషన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ముత్తారం తాసిల్దార్ కార్యాలయంలో 18 మంది కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. డి ఎం ఎఫ్ టి నిధుల ద్వారా ముత్తారం మండలంలోని పలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల మరమత్తు కోసం ₹2 కోట్ల 81 లక్షలతో చేపట్టిన పనులను మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో  గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ గౌడ్,  ఆర్.డి.ఓ. సురేష్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్,  తహసిల్దార్, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు,  తదితరులు పాల్గొన్నారు.