మహాగౌరీ రూపంలో అమ్మవారి దర్శనం !

J.SURENDER KUMAR,

పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న  దసరా నవరాత్రోత్సవములలో సోమవారం ( 8వ రోజున)  అమ్మవారు మహాగౌరీ రూపంలో  భక్తులకు దర్శనమిచ్చింది.

ప్రధాన దేవాలయముతో పాటు ఇతర అనుబధ ఆలయాలో విశ్వక్షేన పూజలు, దీపారాదనలు మొదలగు కార్యక్రమములు జరిగాయి. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో


వేదపండితులు, ఋత్వికులచే మహ సంకల్పము, పృద్వీకలశ, గణపతి పూజ, స్వస్తిః పుణ్యహ వచనము, ఋత్విక్ వర్ణణము, అఖండ దీప స్థాపన, నవగ్రహ, వాస్తు, క్షేత్ర పాలక, యోగిని, అంకురారోపణ, మాతృక, సర్వతోభద్ర మండల పూజలు జరిగాయి.


ఇందులో భాగంగా సప్తశతీ పారాయణము, అమ్మ వారికి చతుషష్ఠి పూజ, శ్రీచక్రమునకు కుంకుమార్చన, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణలు జరిగినవి. మరియు ఐదు(5)ఋత్వికులచే “చండీపారాయణం” & “దేవిభాగవత పారాయణం”, కన్యకా, సువాసిని పూజలు నిర్వహించారు.

సాయంత్రం ఆలయ ఆవరణలో స్థానిక మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమాలు జరిగాయి. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి  లక్ష్మణ్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.