👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
నగరంలోని అత్యుత్తమ వైద్యులను,మహిళా మాతృమూర్తులైన పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారికి ఈ వేదిక ద్వారా పురస్కారాలు నేను అందించడం నాకు ఎంతో సంతోషంగా మరియు గౌరవంగా ఉంది అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యంగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్‌లోని ప్రతిభావంతులైన వైద్యులు మరియు మహిళా పారిశ్రామికవేత్తలను సత్కరించే ఉద్దేశ్యంతో “అచీవర్స్ కాంక్లేవ్ & అవార్డ్స్ 2025” కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై విజేతలకు పురస్కారాలు అందించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
మహిళా సాధికారతకు మరియు ఇతర వర్గాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయి అని మంత్రి అన్నారు.
“ఈ పురస్కారాలు అందుకున్న వైద్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు మీ వృత్తిలో మరిన్ని విజయాలు సాధించి, ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.