👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,
J SURENDER KUMAR,
మన సమాజం మానసిక వికలాంగుల పట్ల మానవీయ కోణంలో సహకారం అందిస్తూ వారికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ ఇయర్ మానేరు డ్యాం కాలని లో బుధవారం మానసిక వికలాంగుల పాఠశాలలో కరీంనగర్ జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సిద్ధిపేట వారి సహకారంతో నిర్వహించిన హెల్త్ క్యాంపును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మరియు జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు.

అనంతరం మంత్రి విద్యార్థులతో కలిసి భోంచేశారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో స్వయంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ పాఠశాల సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఎలాంటి సమస్య అవసరం ఉన్న తనను సంప్రదించాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ వారికి హామీ ఇచ్చారు.