మంథని కి సిబిఐ అధికారులు !

👉 న్యాయవాద దంపతుల హత్య లో ప్రాథమిక విచారణ!

👉 హత్య ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సిబిఐ అధికారుల బృందం !


J . SURRENDER KUMAR,

మంథని ప్రాంతానికి చెందిన, న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, పివి నాగమణి జంట హత్యలపై  క్షేత్రస్థాయిలో సిబిఐ అధికారుల బృందం విచారణ ప్రారంభించింది.గురువారం మంథని కి చేరుకున్న సిబిఐ అధికారుల బృందం మంథని లో  కోర్టు, ప్రాంగణం పరిసరాలను పరిశీలించారు.

న్యాయవాద దంపతుల స్వగ్రామం గుంజపడుగు కు వెళ్లి వామన్ రావు, తండ్రి కిషన్ రావు తో మాట్లాడారు. వామన్ రావు ఇంటిని, గ్రామంలో నిర్మితమైన ఆలయ పరిసరాలను, ఆలయాన్ని పరిశీలించారు. ( న్యాయవాద దంపతుల హత్యలో  ఆలయ నిర్మాణ లో వివాదం చోటు చేసుకుందని ) పోలీసుల విచారణ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. న్యాయవాది వామన్ రావు తండ్రి కిషన్ రావు తో పాటు, అధికారుల బృందం హత్య జరిగిన కల్వచర్ల రోడ్డును, పరిసరాలను పరిశీలించినట్టు తెలిసింది.

వామన్ రావు తండ్రి, గట్టు కిషన్ రావు ,తన కొడుకు కోడలు హత్య సంఘటనలో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం కీలక సూత్రధారులను వదిలి పెట్టారని, నిష్పక్షికంగా దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టు లో 751 పేజీల పిటిషన్ దాఖలు చేశారు.

ఆగస్టు 2025లో, భారత అత్యున్నత న్యాయస్థానం ( సుప్రీంకోర్టు )హత్యల దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి బదిలీ చేసింది, ఈ విషయంలో మరింత దర్యాప్తు అవసరమని పేర్కొంది. CBI విచారణ కోరుతూ నిరంతరం ప్రయత్నిస్తున్న గట్టు వామన్ రావు తండ్రి చేసిన విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది.