మావోయిస్టు పార్టీ లో లేఖల వార్…

👉 ప్రజలే చరిత్ర నిర్మాతలు వాళ్ల ముందు  వాస్తవాలనే వుంచాలి !

👉 మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ @ మల్లోజు వేణుగోపాల్ పేరుతో మరో లేఖ !


J SURENDER KUMAR,

ఐదు దశాబ్దాల ఉద్యమ చరిత్ర గల మావోయిస్టు పార్టీలో లేఖల వార్ కొనసాగుతున్నది. ఆయుధాలు విడిచి శాంతి చర్చలకు సిద్ధం అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి
అభయ్ పేరిట విడుదలైన లేఖ తెలిసిందే. ఇదే పార్టీలో అధికార ప్రతినిధి జగన్, అభయ్ పేరుతో ఆయుధాలు వదిలిపెట్టడం అనేది, ఆయన వ్యక్తిగతం అంటూ, లొంగీ పోవాలంటే, ఆయుధాలు అప్పగించి లొంగిపోవచ్చు అంటూ ఘాటుగా అభయ్ విడుదల చేసిన లేఖ కు కౌంటర్ ఇచ్చారు.ఈ నేపథ్యంలో..అభయ్ పేరిట వివరణ ఇస్తూ మరో లేఖ సోమవారం సామాజిక మాధ్యమాల్లో  జారీ చేశారు.

👉 లేఖలోని అంశాలు…

కామ్రేడ్ జగన్ (తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి) నేను విడుదల చేసిన ‘తాత్కాలిక సాయుధ పోరాట విరమణ’ ప్రకటనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అభినందనీయం. ఆయన దృఢంగా దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాకే ఇంకా కట్టుబడి వుండడం పై నాకెలాంటి. అభ్యంతరం లేదు.

👉 నా ప్రకటనపై కామ్రేడ్ స్పందించిన తీరుపై నేను కామ్రేడ్ జగన్ ప్రకటనలోని ముఖ్యమైన విషయాలపై మాత్రమే నా అభిప్రాయాలను మరోమారు ప్రజల ముందు వుంచక తప్పడం లేదు. అందుకు నేను ఎంతో విచారిస్తున్నాను.

👉 ప్రకటనలో నేను చాలా స్పష్టంగానే మా పార్టీ ప్రధాన కార్యదర్శి అమరుడు కామ్రేడ్ నంబాల కేశవరావు ప్రారంభించిన శాంతి చర్చలను నేను, నాతో పాటు కొంతమంది కామ్రేడ్స్ కొనసాగించదలచుకున్నామనే తెలిపాను,

👉 కామ్రేడ్ రూపేశ్ ఒకరు. కాబట్టి ఇది పూర్తి పార్టీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం కాదనీ జగన్ విడిగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన తొందరపాటుతో ఇచ్చిన ఈ ప్రకటన పార్టీ నిర్మాణ పద్ధతులకు కూడ భిన్నమైనది, ఆయన తన రాష్ట్రానికి పరిమితమై నా ప్రకటనపై  అభిప్రాయాలను ఇవ్వాల్సి వుంటుందనీ ఆయనకు తెలియనిదేమీ కాదు. నేను ఆ విషయాన్ని నా ప్రకటనలో కోరాను కూడా.

👉 ఇక్కడే ఆయనకు మరో విషయాన్ని నేను స్పష్టం చేయదలచుకున్నాను.నవంబర్ 2024లో జీ.ఎస్. సమక్షంలోనే కొంతమంది సీసీఎంలం శాంతి చర్చల విషయాన్ని చర్చించి ఆయుధాలు వదలకుండా ప్రభుత్వం చర్చలకు సిద్ధం లేదనీ, మసం ఇక శాంతి చర్చల గురించి ఆలోచించకూడదని కూడా అభిప్రాయపడినాం, కానీ, దీనికి భిన్నంగా మీ అందుబాటులోని సీసీఎంలు ‘శాంతి చర్చలకు మేం సిద్ధం’ అంటూ, మార్చ్ 2025లో తెలంగాణ శాంతి చర్చల మిత్రులకు అభిప్రాయం పంపారు.

👉 ప్రభుత్వం పదే పదే ఆయుధాలను వదలడం గురించి చెప్పుతున్న విషయంలో అందుబాటులో వున్న కొద్దిమందైనా స్పష్టమైన నిర్ణయం తీసుకొని, దానిని స్పష్టం చేస్తూ ఆ ప్రకటన పంపి ఉండాల్సింది. అలా చేయకపోవడంతో, ఆ ప్రకటననే అనుసరిస్తూ కామ్రేడ్ బసవరాజు, రూపేశ్ లు పరస్పరం చర్చించుకొని శాంతి చర్చలపై అనివార్యంగా ప్రకటనలు విడుదల చేశారు.

👉 ఇవన్నీ నవంబర్ 2024 అవగాహనకు భిన్నమైనవనే విషయం కామ్రేడ్ జగన్ ముందు తన బాధ్యుల నుండి తెలుసుకోవాలి, అయినప్పటికీ, పరిస్థితి తీవ్రతలో వస్తున్న పరిణామాల నేపథ్యంలో కామ్రేడ్స్ చొరవ చేస్తున్నారనే యావత్తు పార్టీ భావించింది. వాటి కొనసాగింపుగానే ప్రస్తుత నా ప్రకటన అనేది ఆయన అర్ధం చేసుకోవాలి,

👉 సీసీలో జరుగుతున్న విషయాలపై ఆయనకు స్పష్టత లేనపుడు ముందుగా వాటిని తెలుసుకొని అవసరం అనుకుంటే వాటిపై తన తమ వైఖరిని సీసీకి పంపుకోవచ్చు. ఆయనకు అన్ని అవకాశాలు వున్నప్పటికీ ఏదీ చేయకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం విచారకరం.

👉 రెండవ విషయానికి వస్తే, పార్టీ అనుమతితో నేను సరెండర్ కావచ్చని ఆయన సలహా ఇచ్చాడు. ఆయన నా ప్రకటనలోని విషయాలపై కానీ, నేను ప్రజలకు చేసిన విజ్ఞప్తిపై కానీ నామమాత్రంగానైనా రాజకీయంగా స్పందించకుండా నా సరెండర్ గురించి మాట్లాడడం ఆయన.

👉 రాజకీయ అపరిపక్వతను చాటుతోంది. నిజానికి ఈ రెండు ప్రకటనలకన్నా, పార్టీలో అంతర్గత సర్క్యులేషన్ కోసం తెలుగులో వేను విడుదల: చేసిన 22 పేజీల కేడర్ విజ్ఞప్తిని ఆయన చదివి దానిపై తన అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపి వుంటే, అది మన సీసీకి, పార్టీకి చాలా ఉ పయోగపడేది. నేను ఆ 22 పేజీల విజ్ఞప్తిలో రాసినవన్నీ మన పీబీ అగస్టు 2024లో విడుదల చేసిన సర్యూలర్ లోనివేనని ఆయనకు ముందుగా స్పష్టం చేస్తున్నాను,

👉 గత యేడాది కాలంగా మనం ఆ సర్కులర్ ను ఎక్కడా అమలు చేయలేకపోయాం. నిజానికి వాటిని మనం అమలు చేస్తూ భారత విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే, మనం తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం అనివార్యమని గత యేడాది ఆచరణ మరింత స్పష్టంగా మనను హెచ్చరిస్తున్నది.

👉 దీనిని నా వ్యక్తిగత విషయంగా మీరు మార్చడం, మీ అమాయకత్వాన్ని ప్రదర్శించుకోవడమే అవుతుంది. మీ అందుబాటులోని సీసీఎంలు కానీ, అమరుడు కామ్రేడ్ బసవరాజు కానీ, మన పార్టీ ఝార్ఖండ్ కామ్రేడ్స్ నుండి విడుదలైన కాల్పుల విరమణ ప్రకటన కానీ మన పార్టీని కాపాడుకోవడానికి తప్ప సరెండర్ల కోసం కాదు. వారు పార్టీని కాపాడుకోవాలనే ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం చొరవ చేశారు.

👉 కామ్రేడ్ బసవరాజు పార్టీ ఆయుధాలు వదలడానికి కూడ సిద్దపడే విషయం ఆలోచించడం కేవలం ఆయన ఒక్కడి ప్రాణాలను కాపాడుకోవడం కోసం కానే కాదు. సరే, ఆయన అలాంటి ప్రతిపాదన చేయడం తప్పని ఈరోజు మీలాంటి కొంత మంది కామ్రేడ్స్ సమీక్షించడం అది మీ వ్యక్తిగతమైనదే అవుతుంది. భవిష్యత్తులో యావత్తు పార్టీ దాని మంచీ చెడులను తేలుస్తుంది.

👉 మీరు కూడా తెలంగాణాలో కాల్పుల విరమణ వేసింది వర్తమాన పరిస్థితులలో మన పార్టీని కాపాడుకోవడానికి కాదంటారా? అయితే, ఇక్కడ తేడాల్లా ప్రభుత్వ వైఖరిని పరిగణనలోకి తీసుకోకుండా, శాంతి చర్చలకు సిద్ధం కావడంలోనే వుంది మన వైఫల్యం వుంది. దీనిని అర్ధం చేసుకోండి. నేను స్వార్థం కోసం, సాయుధ పోరాట విరమణ ప్రకటన ఇవ్వలేదనీ మిమ్మల్ని గైడ్ చేసే సీసీఎంలను అడిగినా చెపుతారు. కామ్రేడ్ బసవరాజుది స్వార్థమైతే, నాది స్వార్ధమే అనుకోండి.

👉 మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడంలో వుంది మన పార్టీ తప్పిదం. దీనిని మీరు ఇప్పటికైనా గుర్తించండి.

👉 నేను మెయిల్ ఐడీ ఇవ్వడంపై కూడ కామ్రేడ్ జగన్ నా ప్రకటనను సవ్యంగా అర్థం చేసుకోలేదు, మనం అవకాశం వున్న మేరకు పరస్పరం కలుసుకోవడం లేద పార్టీ ఛానల్ లో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవడం అనేది నా ప్రకటనలో మొదటి ప్రాధాన్యత విషయం. అలా చేయలేకపోతున్న విధిలేని పరిస్థితులలో మెయిల్ ఐడీ ఇవ్వక తప్పలేదు. మన సీసీ ఎంత సమన్వయరాహిత్యాన్ని ఎంతకాలంగా ఎదుర్కొంటుందో కామ్రేడ్  జగన్ కు నేను చెప్పాల్సిన పనే లేదు. ఐడీ ఇవ్వడం అనేది ఒక ప్రత్యామ్నాయమైన మార్గం మాత్రమే. దాని పరిమితులు మనందరికీ తెలిసినవే!

👉 నేను మరోసారి కామ్రేడ్ జగన్ కు  చేసే విజ్ఞప్తి ఏముంటే ప్రాంతాలవారిగా రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకునే దీర్ఘకాల ప్రజాయుద్ధ పంధా ఇకపై మన దేశ కాల పరిస్థితులకు తగనిది అని తెలంగాణ సహ దేశంలోని అనేక విప్లవోద్యమ ప్రాంతాలు నిరూపించాయి.

👉 ఈ విషయాన్ని మీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి సహ మిమ్ములను గైడ్ చేసే సీసీఎంలు 2020 నాటికే గుర్తించిన విషయం మీరు వారి నుండి తెలుసుకోండి .గత రెండు దశాబ్దాలకు పైగా మనం తెలంగాణ భూభాగంలోకి వెళ్లి విప్లవోద్యమ కృషి చేయలేకపోతున్నామనేది, ప్రతిసారి రక్తతర్పణం చేసి డీకేకు వెనుతిరుగుతున్నామనేది మీరూ, నేనూ, మనమెవరమూ కాదనలేని వాస్తవం. దీనిని ఇప్పటికైనా గుర్తించండి.

👉 మీరు తెలంగాణ ప్రభుత్వంతో 6 మాసాల కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేశారు. త్వరలో ఆ గడువు పూర్తి కాబోతుంది. ఆ తరువాత…. ఆ తరువాత…. ఆ తరువాత…. ఇలా ఎంతకాలం సాగుతుందో మీరు ఊహించండి. కాల్పుల విరమణ కాలంలో మన విప్లప కార్యచరణ పట్ల పోలీసులు అత్యంత అప్రమత్తంగా వుంటారనేది మీరూ కాదనలేరు, కాబట్టి అనవసర నష్టాలకు తావివ్వకుండా విజ్ఞతతో వ్యవహరించడమే విప్లవకారులు వేయాల్సింది. ఇందులో మన సీసీ ఘోరంగా విఫలమైందనే మన 2024 సర్క్యులర్ చెప్పుతుంది. దానిని అర్ధం వేసుకోగలరు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారుదాం. మనం విశాల ప్రజల మధ్యకు వెళ్లి ప్రజాపునాదిని పటిష్టపరుచుకుందాం. అనేది. నా విజ్ఞప్తి, ఆపై మీ ఇష్టం.

👉 ఈ సందర్భంగా నేను ముందుగా నా ప్రకటనపై మేధావుల, విమర్శకుల, ప్రజాస్వామిక వాదుల, విప్లవ శ్రేయోభిలాషుల అభిప్రాయాలను, అంచనాలను ప్రజల వరకు చేర్చడానికి అహోరాత్రులు పాటుపడిన పాత్రికేయులు, ఔత్సాహిక పాత్రికేయులు, యూట్యూబర్లు సహ సామాజిక మాధ్యమాల మిత్రులందరికి రెడ్ కల్యూట్స్ తెలుపుకుంటున్నాను. నా ప్రకటనపై అనేక మంది అనేక రకాలుగా స్పందించడం హర్షనీయం.. ముఖ్యంగా మా పార్టీలో పని చేసి ప్రస్తుతం బయట జీవిస్తున్న వారు అనేక రకాలుగా నా ప్రకటనను వారి వారి అవగాహనల ప్రకారం విశ్లేషిస్తూ తమ అభిప్రాయాలను ప్రజలతో పంచుకోవడాన్ని నేను స్వాగతిస్తున్నాను.

👉 అయితే, మా పార్టీ తొలి నుండి రహస్య పార్టీ, అనేక దశాబ్దాలుగా ఒక విషేధిత పార్టీ, మానూ పార్టీలోని అంతర్గత వ్యవహారాలపై బయటివారు సాధికారికంగా స్పందించలేరనే విషయం విజ్ఞులకు తెలిసిందే. కాబట్టి నేను నా ప్రకటనపై వేసిన తేదీ, ఫోటో, ఇచ్చిన మెయిల్ ఐడీపై కొన్ని సందేహాలు తలెత్తడంతో పాటు కొందరు నేను పార్టీ నుండి కొద్ది కాలం క్రితమే దూరమైపోయి పోలీసుల సంబంధంలో వున్నాననే వరకు మాట్లాడుతున్నారు.

👉 నేను పార్టీ నుండి దూరమైతే కామ్రేడ్ జగన్ మొదట అదే విషయాన్ని తన ప్రకటనలో ప్రస్తావించేవాడనేది బొడ్డూడని శిశువు సైతం చెప్పుతుంది. కామ్రేడ్ దేవిజ్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైనాడనే బూటకపు విషయాన్ని సృష్టించిన మీడియా మా రహస్య పార్టీ విషయాల సేకరణకు కావాలనే అనేక తప్పుడు విషయాలను ముందుకు తెస్తుంది.

👉 అన్నిటిపై నేను ఇక్కడ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు, కానీ, కొన్ని విషయాలపై మాత్రం స్పష్టత ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను.

👉 నేను 15 ఆగస్టునాడు తయారు చేసిన ప్రకటనపై అంచెలంచెలుగా పార్టీ శ్రేణుల మధ్య చర్చ జరిపి చివరకు సెప్టెంబర్ 12 నాడు ఆ చర్చలు ముగిశాక, అందులో ఎలాంటి మార్పులు చేయకుండానే విడుదల చేయడంతో డేట్ విషయం కొంతమందిలో అనుమానాలను రేకిత్తించింది. అంతకు మించి డేట్ కుఎలాంట్ ప్రాధాన్యత లేదు. దురదృష్టవశాత్తు, ఈ చర్చలలో సమన్వయ సమస్యతో కామ్రేడ్ జగన్ కానీ, మరి కొంత మంది ముఖ్యమైన కామ్రేడ్స్ పాల్గొనలేకపోయారు.

👉 ప్రకటనపై నా ఫోటో విషయానికి వస్తే, మా పార్టీలో సీసీ అధికార ప్రతినిథిని నేనే అయినప్పటికీ మా సీసీ కామ్రేడ్స్ ఎవరైనా అభయ్ పేరుతో అత్యవసర సమయాలలో పార్టీ ప్రకటన విడుదల చేయవచ్చనే అవగాహన వుంది.

👉 ఇది మా పార్టీలోని అన్ని కమిటీలకూ వర్తిస్తుంది. కాబట్టి నేను ఈసారి అత్యంత ముఖ్యమైన ఈ విషయంపై నా ఫోటోతో ప్రకటన విడుదల చేయడమే శ్రేయస్కరం అని భావించాను.

👉 ప్రకటనలోనే సాయుధ పోరాట విరమణ కొంత మంది అభిప్రాయం అని రాసినప్పటికీ ఇంకే పారపాటు సందేశం ప్రజలలోకి వెళ్లకుండా వుండడానికే నా ఫోటో వేశాను. దీనినైనా కామ్రేడ్ జగన్ అర్ధం చేసుకుంటే, ఆ ప్రకటన మూలాలు అర్థమయ్యేవి.

👉 నేను ప్రజలకు విడుదల చేసిన విజ్ఞప్తి విషయంలో కూడ కొంతమంది తమకు తోచింది మాట్లాడుతున్నారు. నేను అందులో వ్యక్తం చేసిన విషయాలన్నీ మా పొలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్లోని విషయాల సంగ్రహ పాఠమే.

👉 నేను సాయుధ పోరాట విరమణ ప్రకటన విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇంత కాలం సేవ చేసిన ప్రజలకు బాధ్యతగా, అపరాధ భావనతో క్షమాపణలు చెప్పాను.

👉 చివరగా నా విజ్ఞప్తి ఏమంటే, ఏదైనా ఒక విషయంపై మాట్లాడదలచుకున్న వాళ్లు ఎవరైనప్పటికీ వారు వ్యక్తిగత దూషణలకు దిగడం, వారి సంస్కార హీనతను, రాజకీయ దివాళాకోరుతనాన్నే తెలుపుతుంది. అలాంటివాటితో ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరదు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా స్పందించాలని మనవి.

👉 ముగింపులో కామ్రేడ్ జగన్ కు నా విజ్ఞప్తి ఏమంటే, కామ్రేడ్ జగన్ 1977 ఆగస్టులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ చేసిన తీర్మాణాన్ని దయచేసి క్షుణ్ణంగా చదువు, సరే, దానిని 18 యేళ్ల తరువాత సీసీ ఆ తీర్మానం అవసరం ఆనాడు చేయాల్సిన అవసరం లేకుండేవని సమీక్షించినప్పటికీ, నేటి యువతరం ఆనాటి పరిస్థితులను తెలుసుకోవడానికి అది ఎంతగానో తోడ్పడుతుంది, అందులో ఎంతో అనుభవంతో ఇలా చెప్పారు. “గత పదేళ్ల సాయుధ పోరాటంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అది దెబ్బ తిన్నది. చాలా కష్టం మీద అక్కడొకటి, యిక్కడొకటి యాక్షన్ చేయడం తద్వారా శత్రువుకు కల్గించిన నష్టం కంటే మనం ఎక్కువ నష్టానికి గురవడం జరుగుతోంది.

👉 ప్రజా పునాది ప్రాముఖ్యతను మన కేడర్ గుర్తించకపోవడం కూడా ముఖ్య కారణం. ఆ సంబంధాలే వుంటే, ఒకసారి దెబ్బతిన్న ప్రాంతంలో అతి దీర్ఘకాలం సంబంధాలు నెలకొనకపోవడం జరుగదు”. ఈ నేపథ్యంలో మనం తెలంగాణ విప్లవోద్యమాన్ని మారిన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ పునరాభివృద్ది కోసం పాటుపడాలనీ కోరుతున్నాను.(అభయ్) అధికార ప్రతినిధి, కేంద్రకమిటీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)