మేడారం మహా జాతర నిర్వహణపై మంత్రుల సమీక్ష !

J.SURENDER KUMAR,

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేడారం మహా జాతర నిర్వహణ ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్‌పై బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్, మంత్రి సీతక్కల తో కలిసి, దేవాలయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, ములుగు కలెక్టర్ దివాకర్, ఇతర ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో చర్చించారు


జాతర ప్రాంగణంలోశాశ్వత అభివృద్ధి పనులతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించేలా మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వం రూపొందిస్తోంది.
చరిత్రలో  కనివిని ఎరుగని రీతిలో ఇంతకు ముందెన్నడూ లేనంత వైభ‌వంగా ప్రభుత్వం జాతర నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది అని అధికార యంత్రాంగంకు మంత్రులు వివరించారు.