మైనారిటీ సంక్షేమ పథకాల అమలు తీరు పై సమీక్ష !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR

ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అమలు తీరుపై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సమీక్షించారు. హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్  సచివాలయంలో  గురువారం మైనార్టీ శాఖ ఉన్నతాధికారులు, అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ప్రార్థన మందిరాల  నిర్వాహకుల జీతభత్యాలు,  మైనారిటీ విద్యాసంస్థలలో మౌలిక వసతులు,  విద్యార్థులకు నాణ్యమైన విద్య,  భోజనాలు,  హజ్ యాత్ర, స్వయం ఉపాధి కి రుణాలు మంజూరు, ఉర్దు భాషా అమలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా మంత్రి సమీక్షించారు,

త్వరలో రాష్ట్రంలోని మైనార్టీ విద్యాసంస్థల పురోగతి,  అవసరమైన నిధుల వివరాలు, సౌకర్యాల కల్పన, మరియు వాటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల పై నివేదిక ఇవ్వాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారుల ను ఆదేశించారు.