👉 కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాతీయ సదస్సులో…..
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ !
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునేవారు విద్యార్థులే కాదు వారు మా కన్న బిడ్డ లాంటివారని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో శనివారం రెండు రోజులపాటు జరిగిన కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాతీయ ముగింపు సదస్సుకు మంత్రి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్, సాంఘిక సంక్షేమ శాఖ విద్యాసంస్థల రాష్ట్ర కార్యదర్శి కే. సీతాలక్ష్మి సంబంధిత శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని ఆ జిల్లాలకు చెందిన గిరిజన గురుకుల డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , గత 18 నెలల పాలనలో విద్యాశాఖకు పెద్దపీట వేసి ప్రాధాన్యత కల్పించారన్నారు. విద్యాభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ రాజీ పడరని అన్నారు.

👉 ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఓ సందర్భంలో వాహనంలో ప్రయాణించే సమయంలో విద్యా విషయంలో తనతో స్వయంగా మాట్లాడారని అవసరమైన నిధులు ఎంత కష్టమైనా విద్యాభివృద్ధి కోసం కేటాయిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
👉 విద్యా రంగంలో నేడు వస్తున్న సమూల మార్పులను ఆకలింపు చేసుకొని భవిష్యత్తు ప్రణాళికలను ఏర్పాటు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళుతుందని అన్నారు.
👉 రాష్ట్రంలో గత పాలకుల తప్పుడు విధానాల వల్ల విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొనేలా చేశారని గత ప్రభుత్వాల మాదిరిగా విద్యను అస్తవ్యస్తం చేయకుండా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుదామని మంత్రి సూచించారు.

👉 విద్య విషయంలో అభివృద్ధి నిధులు భవనాల నిర్మాణం వేతనాలు తదితర అంశాలలో సంబంధిత శాఖ కార్యదర్శి ఎక్కడ వెనక్కి తగ్గకూడదని ఒక మంత్రిగా తాను ఆదేశాలు జారీ చేస్తున్నానని విద్యా అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా వెచ్చించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
👉 రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడం ఒక్కో పాఠశాలకు ₹200 కోట్లకు పైగా ఖర్చు చేయడం విద్యాభివృద్ధిపై రేవంత్ రెడ్డికి ఉన్న ఆసక్తి చిత్తశుద్ధి ఏమిటో నిరూపిస్తుందని అన్నారు.

👉 షాద్ నగర్ లాంటి ప్రాంతంలో కృత్రిమ మేధా జాతీయ సదస్సును రెండు రోజులపాటు నిర్వహించిన ప్రిన్సిపల్ డాక్టర్ నీతా పోలేను మంత్రి లక్ష్మణ్ కుమార్ అభినందించారు. ఇక్కడ సదస్సు కోసం తన వంతు సహకారం అందించిన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు, మంత్రి తన శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
👉 మా గిరిజన బిడ్డలు ఎంతో గొప్ప మేధస్సుతో సదస్సులు పాల్గొనడం శుభసూచకమని అన్నారు. గొప్ప చదువులను మా బిడ్డలకు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని విద్యార్థులు ప్రజలు అధికారులు మీడియా పూర్తి సహకారం అందించాలని కోరారు.
👉 ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ…
గత విద్యను నేడు పోల్చితే కొంతకాలంగా ప్రస్తుత విద్యా విధానాల్లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను విద్యార్థులు అర్థం చేసుకుంటు ముందుకు సాగుతున్నారని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు.
👉 గతంలో తాము చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలు అనుభవించే వారమని నాలాంటి వారితో పాటు మంత్రి లాంటి వారు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళమని గుర్తు చేశారు.

👉 నేడు విద్యార్థులకు ప్రభుత్వాలు అన్ని సౌకర్యాలు సమకూర్చి అత్యంత ఆధునికమైన విద్యను సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తున్నారని అన్నారు.
👉 విద్య లేనివాడు వింత పశువు అని అన్నారని కానీ నేడు ఎంతో ఎత్తుకు ఎదిగి విద్యలో కృత్రిమ మేధస్సును సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. విద్యాశాఖను తన ఆధీనంలో పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు.
👉 విద్య అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అభినందించారు. విద్యార్థులకు రెండు రోజులపాటు సదస్సు ఏర్పాటు చేసి ఎంతో మేలు చేశారని నిర్వాహకులను ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున అభినందించారు.
👉 గత ప్రభుత్వం ₹100 కోట్లు కాదు ₹ 100/- రూపాయలు ఇవ్వలేదు !
మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్ గతంలో తమ పవిత్ర జేపీ దర్గా విషయంలో ₹100 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులు ఇస్తానని చెప్పి కనీసం వంద రూపాయలు కూడా కేటాయించలేదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సభలో మంత్రి ముందు విమర్శించారు.
👉 మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా తమ ప్రాంతానికి దర్గాకు విశ్రాంతి భవనం, శౌచలాయాలు నిర్మించేందుకు ముందుకు రావాలని ఈ ప్రాంత మైనార్టీలకు అండగా నిలబడాలని మంత్రిని వేదికపై ఎమ్మెల్యే కోరారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పందిస్తూ దర్గా అభివృద్ధి కోసం ₹ 8 కోట్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ కు మైనార్టీల ఘన సన్మానం!

మంత్రి లక్ష్మణ్ కుమార్ కు షాద్ నగర్, జెపి దర్గాకు చెందిన పలువురు మైనార్టీలు ఘనంగా పూలమాలలు శాలువాలతో సన్మానించారు. మంత్రి రాక సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే ద్వారా ఈ ప్రాంత మైనార్టీల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థనను స్వీకరించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ వెంటనే ₹ 8 కోట్ల రూపాయలు దర్గా అభివృద్ధి కోసం కేటాయిస్తూ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్ రమేష్ బాబు, ఐఐసిటి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ నీతాపోలే, డిప్యూటీ సెక్రటరీ లింగారెడ్డి, వేణుగోపాల్ రావు పాల్గొన్న స్థానిక నేతలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం కాంగ్రెస్ సీనియర్ నేత ఆగిర్యల కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, కొత్తూరు సుదర్శన్ గౌడ్ , వన్నడ ప్రకాష్ గౌడ్, మైనార్టీ నేత జమృత్ ఖాన్, కొమ్ము కృష్ణ,అగ్గనురు బస్వం,జంగ నర్సింహులు, జాకరం చంద్ర శేఖర్, ఆగిర్ రవికుమార్ గుప్త, చలివెంద్రం పల్లి రాజు, రాయ్ కల్ శ్రీనివాస్ , విజయ్ కుమార్ రెడ్డి, అందే మోహన్, జాంగారి రవి, మసూద్ ఖాన్, సింగపగ అనిల్ కుమార్ , లింగారెడ్డి గూడ అశోక్,
నేతలు శ్రీశైలం గౌడ్ , సర్వర్ పాషా, మార్కెట్ కమిటీ డైరక్టర్ కరణాకర్ , భాస్కర్ గౌడ్ ,గోవర్ధన్ గౌడ్ , సత్య నారాయణ రెడ్డి, నర్స ప్ప గూడ కృష్ణ, అర్జున్ లక్ష్మ న్, కమ్మధనం నవీన్ ,జెపి జయ ప్రకాష్, డాకం మనీష్ అశోక్, ముబరక్ , కుమార్ స్వామి గౌడ్ ,అన్వర్, గంగనమోని సత్యయ్య , శ్రీనాథ్, నర్సింహులు, మహేందర్, చిం చెడ్ శ్రీధర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.