J.SURENDER KUMAR,
న్యూజెర్సీలో జరిగిన ప్రతిష్టాత్మక అందాల పోటీలో ‘మిసెస్ చికాగో యూనివర్స్ 2026’ కిరీటాన్ని జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రానికి చెందిన శ్రీమతి బొజ్జ సౌమ్యవాసు
గెలుచుకున్నారు.
ఈనెల 12 న న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో జరిగిన విశ్వ సుందరి అందాల పోటీలో ఆమె ‘మిసెస్ చికాగో యూనివర్స్ 2026’ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
చికాగో లో శ్రీమతి బోజ్జా సౌమ్యవాసు దంపతులు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు.

మే 4, 2025న ‘మిసెస్ భారత్ ఇల్లినాయిస్ 2025’ జరిగిన అందాల పోటీలో ను ఆమె కిరీటాన్ని కైవశం చేసుకున్నారు.
బొజ్జ సౌమ్య , యూనివర్సిటీ ఆఫ్ మిల్వాకీ (University of Milwakee) నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (Bachelors in Fine Arts) డిగ్రీని పొందారు. ప్రస్తుతం ఆమె ఒక బహుళజాతి సంస్థలో వెబ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

చిన్ననాటి నుండి డ్యాన్స్, కొరియోగ్రఫీ పట్ల ఉన్న మక్కువతో ఆమె ఇల్లినాయిస్‌లోని చికాగోలో “వస్త్రం బై సౌమ్య” అనే ఫ్యాషన్ బొటిక్‌ను స్థాపించారు. ఆమె న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2025లో ఫ్యాషన్ డిజైనర్‌గా ఎంపికయ్యారు. చికాగో లో బొజ్జ సౌమ్య, కుటుంబం వృత్తిపరమైన బాధ్యతలతో పాటు సామాజిక కార్యకర్త, మరియు గృహ హింస బాధితులకు కౌన్సిలింగ్ న్యాయపరమైన సహాయ సహకారాలు అందిస్తుంది.
.