మోగిన ఎన్నికల నగర – నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి !

👉 5 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు !

👉 గ్రామీణ ఓటర్ల సంఖ్య 1,67,03,168  (కోటి 67 లక్షల 3వేల 168)

👉 మహిళా ఓటర్లే అధికం. 85,36,770 ( 85 లక్షల 36వేల 770) ఇతరులు 504 మంది ఓటర్లు !


J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుమిదిని  స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రకటన సోమవారం విడుదల చేశారు.

👉 ఎన్నికల కమిషన్ ప్రకటన వివరాలు :-

👉 2 విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు !

👉 3 మూడు విడతల్లో సర్పంచ్‌ ఎన్నికలు !1

ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపాం. ఎన్నికల కమిషన్ వివరించింది.

👉 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు !


👉 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు


👉 అక్టోబర్‌ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలు !


👉 అక్టోబర్‌ 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో దశ ఎన్నికలు !

👉 గ్రామ పంచాయతీ ఎన్నికలు..

👉 అక్టోబర్‌ 31న మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు !

👉 నవంబర్‌ 4న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు !

👉 నవంబర్ 8న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు !

👉 ఓట్ల లెక్కింపు..

👉 నవంబర్‌ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ !

👉 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన రోజే కౌంటింగ్‌ !

👉 ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి దశ నామినేషన్ల దాఖలకు చివరి తేదీ అక్టోబర్‌ 11 .

👉 ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో దశ నామినేషన్ల దాఖలకు చివరి తేదీ అక్టోబర్‌ 15.

👉 మొదటి దశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 9

👉 రెండో దశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 13

👉 ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో మొత్తం

565 జెడ్పిటిసి 5,763 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

👉 12,760 గ్రామపంచాయతీలు,  1,12,534 వార్డులు ఉన్నాయి.. ఇందుల ఎస్టి గ్రామ పంచాయతీల సంఖ్య 1,248. కాగా ఎస్సీ గ్రామ పంచాయతీల సంఖ్య 1,289 ఉన్నాయి

👉 ఆయా రాజకీయ పార్టీల గుర్తులపై జెడ్పిటిసి ఎంపీటీసీ స్థానాలకు ( స్వతంత్ర అభ్యర్థులుగా కూడా) పోటీ చేయవచ్చు. , ఇటీవల ఎన్నిక కమిషన్ లో నమోదు చేసుకున్న  31 రాజకీయ పార్టీలు తమ గుర్తులపై  జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థులకు బి ఫామ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

👉 రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలు పోటీలో ఉన్న అభ్యర్థులకు బి ఫామ్ ఇచ్చే అర్హత కలిగి ఉన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు రాజకీయ పార్టీల గుర్తులు ఉండవు. ఎన్నికల కమిషన్ ఆమోదించి ప్రచురించిన గుర్తులు పైనే పోటీ చేయాల్సి ఉంటుంది.

  1. ↩︎