ముస్లిం మహిళల ఆర్థిక స్వాలంబనమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

పేద ముస్లిం మహిళల ఆర్థిక స్థితి బలోపేతమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముస్లిం మహిళల ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు  ప్రభుత్వం చారిత్రాత్మక చర్యలు తీసుకుంటోందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రహ్మత్‌నగర్‌లో మంగళవారం ముస్లిం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ లతో కలిసి ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

రాష్ట్రవ్యాప్తంగా 42,230 కుట్టు మిషన్ల పంపిణీ లక్ష్యం ఉందని, ఇప్పటివరకు 10,490 మహిళలకు మిషన్లు అందజేశామని అన్నారు. కుట్టు మిషన్ పథకం మహిళల ఆర్థిక స్వావలంబనతో పాటు కుటుంబ భద్రతకు దోహదం చేస్తుంది అని మంత్రి పేర్కొన్నారు.

ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, ఒంటరి మహిళలకు ₹ 50,వేల ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు తెలిపారు.
“రేవంతన్నా కా సహారా” పథకం ద్వారా ముస్లిం ఫఖీర్, దూదేకుల వర్గాలకు ఒక్కొక్కరికి ₹1 లక్ష గ్రాంటుతో మోపెడ్ వాహనాలు అందజేస్తున్నట్టు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

👉 త్వరలో ప్రభుత్వం ప్రారంభించనున్న పథకాల గూర్చి మంత్రి వివరించారు.

👉 తుర్కా కాషా ముస్లింలకు టూల్‌కిట్లు 1,500 మందికి ₹15 కోట్లు !

👉 అనాథ/సెమి ఆర్ఫన్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లకు ల్యాప్‌టాప్‌లు 2,000 మందికి ₹10 కోట్లు !

👉 పేద మైనారిటీ బాలికలకు స్కూటర్లు 1,250 మందికి  ₹ 12.50 కోట్లు !

👉 దివ్యాంగ మైనారిటీలకు రిమోట్ ట్రైసైకిళ్లు 1,000 మందికి ₹ 5 కోట్లు !

👉 MBBS, BDS, లా పట్టభద్రులకు ఒక్కొక్కరికి ₹ 2 లక్షల ఆర్థిక సాయం 1,000 మందికి ₹20 కోట్లు !

👉 మైనారిటీ డ్రైవర్లకు గూడ్స్ క్యారియర్ వాహనాలు 530 మందికి ₹26.50 కోట్లు !

👉 బడ్జెట్ కేటాయింపులు !

2025–26లో ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు వంటి మైనారిటీల సంక్షేమ పథకాలకు మొత్తం 756 కోట్లు కేటాయించామని మంత్రి  లక్ష్మణ్ కుమార్ వివరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు  మీర్జా రహ్మత్ బేగ్, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, ఎంపీ అనిల్ కుమార్, అజారుద్దీన్, కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.