ముస్లింల పథకాల ఆన్‌లైన్  రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభం !

J.SURENDER KUMAR,

ముస్లిం మైనారిటీల సంక్షేమ పథకాల నమోదు ప్రక్రియ కు సంబంధించిన ఆన్ లైన్ పోర్టల్ ను హైదరాబాద్ సచివాలయంలో శుక్రవారం  మంత్రి  లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

👉 “ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన”,

👉 రేవంతన్నా కా సహారా – మిస్కీన్‌ల కోసం”

👉ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియకు లాంచ్ చేసిన పథకాలు !

1) ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన  వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలకు ₹ 50,వేల ఆర్థిక సహాయం !

2 ) రేవంతన్నా కా సహారా – మిస్కీన్‌ల కోసం, ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు, ఒక్కొక్కరికి ₹ 1 లక్ష గ్రాంట్ !

👉 రిజిస్ట్రేషన్ నమోదు వివరాలు !

ప్రారంభం :  19-09-2025……

చివరి తేదీ : 06-10-2025……

ఆన్‌లైన్ : TGOBMMS వెబ్‌పోర్టల్ (tgobmms.cgg.gov.in)

👉 నోట్ : ఆఫ్‌లైన్ దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవు !.

ఈ కార్యక్రమంలో  మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, గ్రంథాలయాల చైర్మన్ డా. రియాజ్, కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మనలా మోహన్ రెడ్డి, TGMFC వీసీ & ఎం.డి కాంతి వెస్లీ IAS, షఫియుల్లా IFS, AGM కె. పెర్సిస్, రీజినల్ అధికారి ప్రవీణ్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు