నా గెలుపుకు కష్టపడిన తరహాలోనే స్థానిక ఎన్నికలలో కష్టపడాలి !

👉 బిఆర్ఎస్ నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా..

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

నా గెలుపు కోసం ఏ విధంగా పార్టీ నాయకులు  కష్టపడ్డారో,  మీ గ్రామ ఎంపీటీసీ, జడ్పీటీసీ సర్పంచుల గెలుపు కొరకు అదే విధంగా  కార్యకర్తలు పార్టీలో చేరిన నాయకులు, కష్టపడి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను  గెలిపించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.


ధర్మపురి మండలంలోని వివిధ  గ్రామాల్లోని టిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, కార్యకర్తలు నాయకుల వందలాదిమంది సోమవారం ధర్మపురి మంత్రి క్యాంపు కార్యాలయంలో   మంత్రి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కాంగ్రెస్ పార్టీ  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

👉 ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ…

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రాష్ట్రాన్ని చేస్తున్న అభివృద్దికి మరియు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతున్నానని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన ఓడిన ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో వెన్నంటి ఉన్నానని మంత్రి అన్నారు.  పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అర్హతను బట్టివారికి సముచిత స్థానాన్ని కల్పిస్తామని, మంత్రి అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి  నా పైన నమ్మకం ఉంచి ఐదు శాఖల బాధ్యతలు నా పైన ఉంచడమే కాకుండా, నల్గొండ జిల్లాకు ఇంచార్జి గా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగిందని, ఒక దళిత నాయకుడిని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన కూర్చునే అవకాశం నాకు దక్కిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

పోలీసు బందోబస్తులు, ఆడంబరాలు శాశ్వతం కాదని కార్యకర్తల ప్రేమ అభిమానాలే శాశ్వతమని, కార్యకర్తలు నాయకులు అందరూ కష్టపడి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనీ గెలిపించాలని తెలిపారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.