J.SURENDER KUMAR,
న్యాయవాదులు గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల హత్యకేసులో సిబిఐ దర్యాప్తు మొదలు పెట్టింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కాల్వచర్ల వద్ద 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాద దంపతుల హత్యకేసు దర్యాప్తు బాధ్యతలను
సీబీఐకి అప్పగించాలని కోరుతూ వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
విచారణ జరిపిన సుప్రీంకోర్టు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్ప గిస్తూ గత నెల12న జారీచేసిన ఉత్తర్వుల మేరకు సీబీఐ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఇన్స్పెక్టర్ విపిన్ గహలోత్ చేపట్టనున్నారు.
న్యాయవాది వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు 2021 , నవంబర్ లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2021లో జరిగిన ఈ హత్యకు సంబంధించి పుట్టా మధూకర్ ప్రధాన పాత్ర పోషించినట్లు మరణ వాంగ్మూలంలో వామనరావు స్పష్టంగా చెప్పారు. అయినా రాష్ట్ర పోలీసులు ఉద్దేశపూర్వకంగా అతడిని నిందితుల జాబితా నుంచి తప్పించారు. అందువల్ల ఈ కేసు నిష్పాక్షిక విచారణ కోసం సీబీఐకి అప్పగించండి” అని వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
హత్య కేసులో ఉన్న ఏడుగురు నిందితులు ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. సిఐడి లేదా సిపిఐ దర్యాప్తుకు స్పందించాలని కోరుతూ నిందితులకు నోటీసులు అందాయి.
మంథని కోర్టులో ఫిబ్రవరి 17, 2021 న  ఓ కేసులో వాదించడానికి హాజరై తిరిగి హైదరాబాదుకు కారులో . న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, వి నాగమణి లు వెళుతున్నారు.
వారు ప్రయాణిస్తున్న కారును  రామగిరి మండలం కల్వచర్లలోని మంథని – పెద్దపల్లి రహదారిపై నిందితులు అడ్డుకొని దంపతులను కారులోంచి బయటకి లాగి పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే.

 
													