నేడు ధర్మపురిలో మహా సత్సంగ్!

👉 విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో..

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో నేటి (శనివారం) సాయంత్రం విశ్వ హిందూ పరిషత్ ధర్మపురి శాఖ ఆధ్వర్యంలో స్థానిక శ్రీరామలింగేశ్వర ఆలయం ( శివాలయంలో) మాహసత్సంగ్ కార్యక్రమం జరగనున్నది.

విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, భోజనపల్లి నరసింహమూర్తి, ప్రధాన వక్తగా భాగ్యనగర్ క్షేత్ర సత్సంగ్ ప్రముఖ శాలివాహన పండరినాథ్ పాల్గొననున్నారు.

ధర్మపురి ప్రఖండలో గత 52 వారాలుగా 8 సత్సంగములు కొనసాగుతున్నాయి,. అన్ని సత్సంగములను కలిపి  శనివారం రోజున మహా సత్సంగము  నిర్వహించుకోనున్నారు.

సత్సంగం లో జ్యోతి ప్రజ్వలన, బ్రహ్మనాధ్, ఏకతా మంత్రం, విజయ మహా మంత్రం, హనుమాన్ చాలీసా పారాయణం, దేశభక్తి గీతం, సుభాషితం, వక్త ప్రసంగం చివరిగా భారతమాత హారతి, శాంతి మంత్రం, జయ ఘోషలు తో కార్యక్రమం ముగియనున్నది స్థానిక విషయంగా పరిషత్ శాఖ ప్రకటనలో పేర్కొంది.