J.SURENDER KUMAR,
ధర్మపురి క్షేత్రంలో సోమవారం నుండి శ్రీరామలింగేశ్వర స్వామి (శివాలయము) లో దసరా నవరాత్రోత్సవములు సాంప్రదాయ పద్ధతిలో జరగనున్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, పాలకవర్గ చైర్మన్ జక్కు రవీందర్ తెలిపారు.
ప్రతినిత్యం ఉదయం సాయంత్రం విశేష పూజ కార్యక్రమాలు జరగనున్నాయి

సోమవారం ఆలయంలో ఉదయం కలశస్థాపన, స్వస్తి: పుణ్యహవాచనము, కలశ గణపతి పూజ, ఋత్వికవర్ణణ, మహాసంకల్పము, ప్రధాన కలశ స్థాపన, చతుషష్ఠిపణ, చండీ పారాయణము, హారతి, మంత్రపుష్ణము, తీర్థప్రసాద వితరణ జరగనున్నాయి.
👉 ప్రతిరోజు చతుషష్టిపూజ, చండీ పారాయణము, ప్రత్యేక పూజలు, హారతి, మంత్రపుష్పము, తీర్ధప్రసాద వితరణ .
👉 నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు!
కార్యక్రమముల గూర్చి స్థానిక వేదబ్రాహ్మణులతో అర్చక స్వాములతో చర్చించి వారుప్రతిపాదించిన పూజలు, కార్యక్రమముల వివరములను వారు తెలిపారు.
ప్రతిరోజు మూలమంత్రంతో ఐదు(5)గురు బ్రాహ్మణోత్తములతో “చండీపారాయణం”
శ్రీరామలీగేశ్వరస్వామి వారికి ప్రతిరోజు “ఏకాదశ రుద్రాభిషేకం”
ప్రతిరోజు “కుమారిపూజ సుహాసినిపూజలు”
ఋత్వికులు అందరికి ఒకేరకమైన దీక్షావస్త్రాలు
9 రోజులు ప్రతినిత్యం “దేవీభాగవత పారాయణం”
ప్రతిరోజు ఉదయం సాయంత్రం “దూపం, దీపం, హారతి”
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సన్నాయి వాయిద్యం (నివేదన, హారతి సమయములో)
ప్రతిరోజు అమ్మవారికి ఉదయం “మహానివేదన” సాయంత్రం ప్రత్యేక ప్రసాదం .
మహార్నవమి రోజు “హోమం, పూర్ణాహుతి” పూర్ణాహుతి రోజున “అన్నదానం” వేద పండితులకు.
👉 శ్రీ దేవినవరాత్రోత్సవములలో ప్రతినిత్యం పూజలు నిర్వహించే చండీపారాయణం!
సిహెచ్. ముత్యాల శర్మ, జి.భరత్ శర్మ, అలువాల క్రిష్ణ శర్మ, తాడూరి బాలరాం శర్మ, గుడ్ల రమేష్ శర్మ
👉 చతుషష్టి పూజలు !
పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ, బొజ్జ రాజగోపాల్ శర్మ
👉 స్థాపితాదేవతాపూజలు;
నంబి అరుణ్ కుమార్
👉 దేవిభాగవత పారాయణం
బొజ్జ సంపత్ కుమార్ శర్మ
👉 ఏకాదశ రుద్రాభిషేకం
డి. నారాయణ శర్మ, డి.సాయిక్రిష్ణ శర్మ
👉 పూజలు అలంకరణ!
పి.సందీప్ శర్మ , వీరి ఆధ్వర్యంలో నిత్యం ఉత్సవాలు జరగనున్నాయని కార్యనిర్వహణాధికారి, పాలకవర్గ చైర్మన్ తెలిపారు.