👉 మాజీమంత్రి జీవన్ రెడ్డి !
J SURENDER KUMAR,
ఫీజు రీయిం బార్స్మెంట్ ప్రవేశపెట్టి నిరుపేదలకు ఉన్నత, సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చిన మహానేత స్వర్గీయ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి తాటి పర్తి జీవన్ రెడ్డి ఆద్వర్యంలో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు.
వై ఎస్ ఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి, మౌనం పాటించి నివాళులర్పించారు. జోహార్ వై ఎస్ ఆర్.. వై ఎస్ ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
ఆరోగ్యశ్రీ పథకంతో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి ఆస్పత్రుల్లో లక్షలాది మందికి ఉచిత వైద్యం అందించి, నిరుపేదల గుండెల్లో నిలిచిపోయారు అని అన్నారు
సామాజికంగా వెనకబడిన ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించారు.
108, 104 పథకాలతో లక్షలాది మందికి ప్రాణదానం చేశారు.
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంలో వై ఎస్ ఆర్ కృషి ఎనలేనిది. వై ఎస్ ఆర్ పంచ్ కట్టు లోనే రైతు మూర్తీభవించాడు. జీవన్ రెడ్డి అన్నారు.