👉 కలెక్టర్ బి. సత్యప్రసాద్ !
J.SURENDER KUMAR,
శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఆడిటరియంలో గ్రామ పంచాయతీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, భవిత సెంటర్లు,పాఠశాలల్లో గల కిచెన్ షెడ్, సౌచాలయాల నిర్మణాలపై జిల్లా పంచాయతీ ఇంజనీరింగ్, ఎంపిడివోలతో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు.
అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ, భవిత సెంటర్ గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలల్లో కిచెన్ షెడ్, సౌచలయాల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు.

అదేవిదంగా మార్కౌట్ చేసిన పనులను త్వరగా ప్రారంభించాలని, పనులు ప్రారంభించిన భవనాలను త్వరగా పూర్తిచేసే విధంగా ఒప్పంద నిర్వాహకులకు సూచనలు ఇవ్వాలని తెలిపారు.
శితిలావస్థ లో ఉన్న అంగన్వాడీ భవనాలను గుర్తించివాటి స్థానంలో నూతనంగా మంజూరైనా అంగన్వాడీ కేంద్ర భవనాల పనులు ప్రారంభించాలని కోరారు.
స్థల సేకరణలో సమస్యలు ఉంట తెలియజేయాలన్నారు పాఠశాల సౌచ్చలయాల నిర్మాణాల ఏర్పాటులో జాప్యం చేయకూడదని ఇదివరకే అనుమతులు ఇచ్చిన నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఏదైనా ప్రజలతో సమస్యలుంటే గ్రామ సభలో సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరుగుతున్న పనులను పర్యవేక్షించి త్వరగా పూర్తి చేయాలి.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్. లత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజగౌడ్, జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి రఘువరన్, జిల్లా పంచాయతీ అధికారి మదన్మోహన్, ఈపిఆర్వో లక్ష్మణ్ రావు, ఎంపిడివో లు, పంచాయతీ ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
👉 అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా బాధ్యతలు స్వీకరించిన రాజగౌడ్ !
జగిత్యాల జిల్లా సమీకృత భవన సముదాయంలో శుక్రవారం నూతన భాద్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) రాజగౌడ్ మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు.

అనంతరం వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో జిల్లా అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యతగా విధులు నిర్వహిస్తానని అన్నారు.