పార్టీ నుంచి సోను @ మల్లోజుల వేణుగోపాల్ బహిష్కరణ ? 

👉 అభయ్ అనే పేరు మావోయిస్టు పార్టీ పెట్టిన పేరు సి కా స రమాకాంత్ లాగా…

J.SURENDER KUMAR,

ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించేందుకు సిద్ధంగా ఉందంటూ పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో (సోనూ) విడుదల చేసిన ప్రకటనను ఆ పార్టీ తప్పుబట్టింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ నుంచి సోను @ మల్లోజుల వేణుగోపాల్ ను బహిష్కరణ బహిష్కరించినట్టు సమాచారం.

సోను వద్ద  ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీకి నిర్దేశించింది.
ఆయుధాలు వదిలి ప్రధాన స్రవంతిలో కలవడమంటే శత్రువుకు లొంగిపోవడమే అని, అది విప్లవోద్యమాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర అని పేర్కొంది. పార్టీ ఆయుధాలు ప్రభుత్వానికి అప్పగించే అధికారం సోనూకు లేదని స్పష్టం చేసింది.

ఆపరేషన్‌ కగార్‌ను తిప్పిగొట్టేందుకు, విప్లవాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాయుద్ధాన్ని కొనసాగించడమే తమ కర్తవ్యమని పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ (నూతనంగా ఎన్నికైన అధికార ప్రతినిధి), దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ ప్రకటించారు.

ఈ ప్రకటనను రెండు రోజుల క్రితమే విడుదల చేసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రకటన మీడియాకు చేరేలోపే వికల్ప్‌ (కట్ట రామచంద్రారెడ్డి) సహా మరో కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి  ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. సోనూ విప్లవద్రోహాన్ని ఎండగట్టడతూ పార్టీ సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తుందని ప్రకటించిన వెంటనే ఇద్దరు అగ్రనేతలు ఎదురు కాల్పులు హతమయ్యారు. .

👉 మావోయిస్టుల పత్రికా ప్రకటన..

👉 శత్రువుకు ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల ప్రయోజనాలకు ద్రోహం చేయడం మా విధానం కాదు.

👉 మారిన సామాజిక పరిస్థితికి తగినట్టుగా వెనకంజలోని విప్లవోద్యమాన్ని పురోగమింపచేయడానికి వర్గపోరాటాన్ని- ప్రజాయుద్ధాన్ని కొనసాగించడమే మా కర్తవ్యం.
సెప్టెంబర్ 17 నుండి ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో మా పార్టీ పొలిట్ బ్యూరో (పీబీ) సభ్యుడు కామ్రేడ్ సోను, అభయ్ పేరుతో విడుదల చేసిన పత్రికా ప్రకటన, దాని ఆడియో ఫైల్, విప్లవ ప్రజలకు విజ్ఞప్తి అనే ప్రకటనలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అంటూ హిందీలో సుదీర్ఘ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు

విప్లవాభినందనాలతో,
Abhay
అభయ్
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

विकल्प
అధికార ప్రతినిధి,
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)