పేద ప్రజలు పార్టీ కాంగ్రెస్ పార్టీ మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 బిఆర్ఎస్ బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరిన క్యాడర్ !


J.SURENDER KUMAR,

పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలో  చేరిన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతున్నానని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


బుగ్గారం మండల కేంద్రంలో ఆదివారం  పోచమ్మ ఫంక్షన్ హాల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల, ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండలానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు  మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి మంత్రి కాంగ్రెస్ కండువా  కప్పి  ఆహ్వానించారు.

👉 ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ..

గత 10 సంవత్సరాల కాలంలో పేద ప్రజల గురించి పట్టించుకొని బిఆర్ఎస్  నాయకులు కాంగ్రెస్ పార్టీ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, మంత్రి ఆరోపించారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బుగ్గారం మండల కేంద్రంలోని ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని దానికి సంబంధించిన భవన నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని, మంత్రి అన్నారు.

గత ప్రభుత్వంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామని, దళితున్ని ముఖ్య మంత్రి చేస్తామని ఇచ్చిన హామీ లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2వందల యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం, రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ఏదో చుట్టం చూపుల వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన అసత్యపు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని, బుగ్గారం మండలానికి చెందిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి  అన్నారు.