👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మా ప్రజా పాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతిక, అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
గొల్లపల్లి మండలం లొత్తునూరు గ్రామంలో గురువారం 20 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా అధికారులతో కలిసి హాజరై అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేసి అనంతరం ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుపోశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
అత్యంత పేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, విడతల వారీగా ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ₹ 2 లక్షల వరకు రుణమాఫీ, 50 వేల ఉద్యోగాల కల్పన వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి ఇసుక ఉచితంగా ఇవ్వడమే కాకుండా, సిమెంట్, స్టీల్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇళ్ల నిర్మాణంలో బేస్మెంట్, ఇతర దశలు పూర్తి కాగానే పంచాయతీ కార్యదర్శులకు సమాచారం అందజేయాలని, వారు నిర్మాణ దశలను ఆన్ లైన్ లో అప్‌డేట్ చేయడం ద్వారా లబ్ధిదారులకు బిల్లులు త్వరగా విడుదల అవుతాయని మంత్రి స్పష్టం చేశారు.
పెద్ద ఎత్తున పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే, దాన్ని ఓర్వలేక బిఆర్ఎస్, బిజెపి పార్టీలు మా పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు.

బిఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆస్తి తగాదాల్లోనే చిక్కుకుని పోయిందని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.