👉మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR ,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని శనివారం మంత్రి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వేద పండితులు పాలకవర్గ సభ్యులు మంత్రికి పూలమాలవేసి వేళ తాళాలతో ఆలయంలోకి స్వాగతించారు.
స్వామివారి దర్శనానంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్, అసహనం వ్యక్తం చేస్తూ, ఎన్నిసార్లు చెప్పాలి స్వామివారి దర్శనంకు వచ్చిన ప్రతిసారి ప్రోటోకాల్ స్వాగతలు వద్దు అని సిబ్బందిని మందలించారు. మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతం కావద్దని మంత్రి సూచించారు.
👉 విద్యార్థి అభ్యర్థనకు మంత్రి ఫిదా !

సార్, మీరు మినిస్టర్ కదా, అంటూ 5వ తరగతి విద్యార్థి మంత్రి లక్ష్మణ్ కుమార్ ను అడిగాడు. మంత్రి అవును అంటూ, ఆగి ఆ బాలుడిని నీ మంత్రి దగ్గర తీసుకున్నారు.
సార్ మా నానమ్మకు ఇల్లు వచ్చింది. మా అమ్మకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి అని చేతులు కట్టుకొని మంత్రిని కోరాడు. ఫిదా అయిన మంత్రి ఆధార్ కార్డు ఉందా ? అని అడిగాడు. ఉంది సార్ అన్నాడు.
నువ్వు ఏం చదువుకుంటున్నావ్ అని మంత్రి అడగడంతో, సార్ నేను ఐదవ తరగతి ఆంగ్ల వేదిక స్కూల్లో చదువుతున్నాను అంటూ చేతులు కట్టుకొని మంత్రిని వేడుకున్నాడు. స్పందించిన మంత్రి కాంగ్రెస్ నాయకుడు దినేష్ తో ఈ ఈ పిల్లవాడి తల్లికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నాను. రేపు ఉదయం క్యాంప్ ఆఫీస్ కు పిల్లవాడిని తీసుకోరా అంటూ దినేష్ ను మంత్రి ఆదేశించారు.
నీవు చదువుకొని ఏం కావాలి అనుకుంటున్నావ్ అని మంత్రి పిల్లవాడిని అడిగారు. సార్ నేను క్రికెటర్ ని అవుతాను అని బాలుడు సమాధానంతో శభాష్ అంటూ పిల్లవాడిని మంత్రి దగ్గరికి తీసుకొని ఆ లింగనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మంత్రి ధర్మపురి పట్టణంలో వినాయక మండపాలు సందర్శిస్తున్న సమయంలో జరిగింది.