ప్రైవేట్ పాఠశాలల వార్షిక సమావేశం అభినందనీయం!

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ప్రైవేట్ రికగ్నిజ్డ్ పాఠశాల యాజమాన్యం వార్షిక సమావేశం నిర్వహించుకోవడం అభినందనీయమని 
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రైవేట్ రికగ్నిజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన వార్షిక సమావేశ కార్యక్రమానికి  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ప్రైవేట్ పాఠశాల వార్షిక నివేదిక అనేది విద్యా సంవత్సరంలో పాఠశాల సాధించిన విజయాలు, కార్యకలాపాలు  ఆధునిక విద్య బోధనలు, పాఠశాలల నిర్వహణ  కష్టనష్టాలు నిర్వాహకులు తమ ప్రసంగంలో వివరించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల నిర్వాహకులను, మంత్రి మెమొంటో బహుకరించి సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాలల యాజమాన్యలు మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.