👉 గోదావరి పుష్కర ఏర్పాట్లు ముందస్తు సమీక్ష సమావేశంలో...
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
2027లో జులై 23న ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు వ్యవధి చాలా ఉన్నందున భక్తుల సౌకర్యార్థం శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కల్పనపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారిని, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, శైలజ రామయ్యర్, దేవదాయ శాఖ సలహాదారులు, జిల్లా కలెక్టర్, సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్, బిఎస్ లత, దేవస్థానం ఈవో శ్రీనివాస్ సంబంధిత అధికారులతో బుధవారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్నతస్థాయి ప్రాథమిక సమీక్ష సమావేశం జరిగింది.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

ధర్మపురి అసెంబ్లీ పరిధి గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి మాస్టర్ ప్లాన్ రూపొందిచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పునః నిర్మాణం పై సంక్షేమ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ తో చర్చించారు.
అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి అన్నారు.
👉 రోజు 2 లక్షల మంది భక్తులు వచ్చిన….
పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని
ఒకే రోజు 2 లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేయాలని మంత్రి అధికారులకు సూచనలు చేశారు.
పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్‌తో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు.
👉 దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ…

ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం చేపడతామని ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య అన్నారు. ధర్మపురిలో పలు ప్రాంతాలను ఆమె పరిశీలించారు.
2027 జూలై లో జరగనున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని శైలజ రామయ్యార్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి మాస్టర్ ప్లాన్ రూపొందిచాలని ఆదేశించారు.
ఇదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.
👉 కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ….

జిల్లాలో పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పనుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో ప్రవేశించే గోదావరి నది తీరం వెంట ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని కలెక్టర్ వివరించారు.
పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో వైద్య ఆరోగ్య శాఖ, పర్యాటక, పోలీసు శాఖ, నీటి పారుదల, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ, అదనపు కలెక్టర్ ఆర్డీవో, సంబంధిత అధికారులతో పలు పుష్కర ప్రాంతాలను, కోనేరు, ఆలయ పరిసరాలను, కోటిలింగాల పుష్కర ఘాట్లను, పరిశీలించారు.
ఈసమావేశంలో అదనపు కలెక్టర్ బి. ఎస్ లత, ఆర్డీవో మధుసూదన్, ధర్మపురి ఆలయ ఈవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
👉 కోటిలింగాల క్షేత్రంలో…

ధర్మపురి నదీ తీర ప్రాంతాలతో పాటు వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని పుష్కరఘూట్లను ప్రత్యక్షంగా దేవాదాయ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజా రామయ్యార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్. పరిశీలించారు.
శ్రీ కోటేశ్వర స్వామి, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికగా
ఆలయ మండపంలో స్వామివారి చిత్రపటాన్ని అందించి తీర్థప్రసాదలతో శేషవస్త్రంతో సత్కరించారు.