రంగారావు మృతి చాలా బాధాకరం!

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న గండ్ర రంగారావు మృతి చెందడం చాలా బాధాకరం ఆయన మృతి తీరని లోటు అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ  లక్ష్మణ్ కుమార్ అన్నారు. వెలగటూర్ మండలం కప్పారావుపేటకు చెందిన గండ్ర రంగారావు మృతి రాజకీయంగా, సామాజికంగా తీరని లోటు అని మంత్రి  మంత్రి అన్నారు.

గతంలో న్యాయవాద విద్య  పూర్తి చేసినా గ్రామంలోనే స్వర్గీయ రంగారావు ప్రజలకు సేవలు అందించాలన్నారు.
  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న ఆయన హైదరాబాద్ లో చికిత్స పొంది కోలుకున్నారు మంత్రి అన్నారు. రంగారావు మృతదేహం కు పూలమాలవేసి నివాళులర్పించి మంత్రి రంగారావు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

ఆయన కుమారుడు వెంకట రమణారావు అమెరికా నుండి రావడంతో  గురువారం స్వగ్రామంలో  కప్పారావుపేటఅంత్యక్రియలు జరిగాయి.  చలి మెడ మెడికల్ కళాశాల సీఎండీ చల్మెడ లక్ష్మీనర్సింహరావు, వెలగటూర్ మాజీ  ఎంపీపీలు శ్రీనివాసరావు, అశోక్,  రామ్మోహన్రావు, నర్సింగరావు, గోపాల్రెడ్డి, రాంరెడ్డి, శైలేందర్ రెడ్డి తదితరులు నాయకులు గ్రామ ప్రజలు రంగారావు అంతిమయాత్రలో పాల్గొన్నారు.