రాష్ట్ర బతుకమ్మ కు గిన్నిస్ వరల్డ్ రికార్డు !

J SURENDER KUMAR,

ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన అతి పెద్ద బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును అధికారులను అభినందించారు.

హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుక అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద సంప్రదాయ నృత్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసుకుంది.

ఈనేపథ్యంలో మంత్రి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి  జూబ్లీహిల్స్ నివాసంలో మంగళవారం ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

👉 క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి!

ఆసియా కప్ -2025 లో భారత జట్టును విజేతగా నిలపడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ క్రికెటర్ తిలక్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను, కోచ్ సలాం బయాష్‌ను ముఖ్యమంత్రి  సత్కరించారు.

తిలక్ వర్మ తన క్రికెట్ బ్యాట్‌ను ముఖ్యమంత్రి కి బహూకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ క్రీడా ప్రాథికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి తో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు.