👉 కన్వీనర్ మానాల కిషన్ !
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సదస్సు సోమవారం జగిత్యాల పట్టణంలో జరగనున్నదని కన్వీనర్ మానాల కిషన్ తెలిపారు.
జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారధన్ మహారాజ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న “మా భూమి రథయాత్ర “ఏప్రిల్ 14వ తేదీన అంబెడ్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని (ఆదిలాబాద్, నిర్మల్ )పూర్తి చేసుకోని ఈ సెప్టెంబర్ 15 న జగిత్యాల ఆవిర్భావ సదస్సు కి రానున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యావంతులు, మేధావులు, అన్ని కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, పాల్గొని విజయవంతం చేయాలని 16 నుండి జిల్లా లోని మండలాలో మా భూమి రథ యాత్ర లో బాగంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం యాత్ర జరుగుతుంది, మానాల కిషన్ తెలిపారు. పట్టణంలోని దేవి శ్రీ గార్డెన్ లో ఉదయం సదస్సు ప్రారంభం కానున్నదని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ రీజినల్ ఇన్చార్జి శ్రీకాంత్, జిల్లా సభ్యులు శివ ,తదితరులు పాల్గొన్నారు