J.SURENDER KUMAR,
రేపు అనగా సెప్టెంబర్ 07న చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుండి టిటిడి స్థానిక ఆలయాలు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాల తలుపులు మూసివేస్తారు.
సెప్టెంబర్ 07వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గం.ల నుండి 08వ తేదీ సోమవారం వేకువ జాము 1.31 గం.ల వరకు చంద్రగ్రహణం ఉంటుంది.
గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.
👉 తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం !
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయాన్ని 07వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 02.15 గం.ల నుండి మూసివేస్తారు. 08వ తేదీ సోమవారం ఉదయం 04.00 గం.లకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యవచనం చేస్తారు. ఉదయం 08.00 గం.ల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
👉 శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం!
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో 07వ తేదీ మద్యాహ్నం 01.30 గం.ల నుండి 03.00 గం.ల వరకు శుద్ధి, పూలంగి సేవ, శాత్తుమొర తదితర సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం మద్యాహ్నం 03.30 గం.లకు ఆలయాన్ని మూసివేస్తారు. 08వ తేదీ సోమవారం ఉదయం 04.30 గం.ల నుండి పలు సేవలు అనంతరం ఉదయం 09.30 గం.లకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
👉 శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం!
శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని 07వ తేదీ మధ్యాహ్నం 01.30 గం.ల నుండి 03.00 గం.ల వరకు కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించి 03.30 గం.లకు ఆలయాన్ని మూసివేస్తారు. 08వ తేదీ సోమవారం ఉదయం 04.45 గం.లకు తెరుస్తారు. తదుపరి ఏకాంత సేవల తర్వాత ఉదయం 08.30 గం.లకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
👉 కపిలతీర్థం ఆలయం !
కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం మద్యాహ్నం 01.30 గం.ల నుండి సోమవారం ఉదయం 03.00 గం.లకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆలయశుద్ధి, సుప్రభాతం, అభిషేకం, అర్చన సేవల తదుపరి ఉదయం 07.00 గం.ల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
అమరావతిలోని ఎస్వీ ఆలయం, నారాయణవనం, కార్వేటినగరం, కడప, ఒంటిమిట్ట తదితర ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం 01.50 గం.లకు మూసి వేసి, 08వ తేదీ సోమవారం ఉదయం 03.00 గం.లకు తెరుస్తారు.
👉 ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం !

ఆదివారం రోజున చంద్రగ్రహణం సంభవించుచున్నందున జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయము మధ్యాహ్నం శ్రీ స్వామివారి మహనివేదన అనంతరం 1 గంటలకు ప్రధాన దేవాలయముతొ పాటు అనుబంధ దేవాలయములు అన్నియు మూసివేసి తిరిగి తేదీ 08- 09 2025 సోమవారం రోజున ఉదయం 5 గంటలకు అన్ని దేవాలయాలు తీసి సంప్రోక్షణ గ్రహణ శాంతి హోమం , అభిషేకం అనంతరం ఉదయం 9:30 గంటలకు భక్తులకు దర్శనం ప్రారంభించబడును
👉 కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం !

జగిత్యాల జిల్లా శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం
ఆదివారము రోజున రాత్రి రాహుగ్రస్త చంద్ర గ్రహణం సందర్భముగా ఆదివారము రోజున మధ్యాహ్నం 12:30 నిమిషాలకు శ్రీ స్వామి వారికి నివేదన అనంతరం దేవాలయ ద్వారబందనం చేయబడును. 7న ఆదివారము రోజున మధ్యాహ్నం 12:00 గంటల నుండి అన్ని ఆర్జిత సేవలు రద్దుపరచనైనది. తిరిగి గ్రహణము అనంతరము అనగా 8న సోమవారం రోజున పుణ్యహవచనం, సంప్రోక్షణ, తిరుమంజనము & ఆరాధన అనంతరము ఉదయము 7:00 గంటల నుండి యదావిధిగా భక్తులకు సర్వదర్శనము మరియు ఆర్జిత సేవలు ప్రారంభమగును.