రైతు పక్షపాతి స్వర్గీయ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

స్వర్గీయ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రైతుల పక్షపాతి, మానవతావాది అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

వైయస్సార్ వర్ధంతి సందర్భంగా మంగళవారం హైదరాబాదులోని పంజాగుట్ట సర్కిల్ లో  వైయస్సార్  విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

2004 అధికారం చేపట్టి ప్రమాణ స్వీకారం రోజున రైతులకు ఉచిత విద్యుత్ పై మొదటి సంతకం చేసిన మహనీయుడు వైయస్సార్ అన్నారు. రైతుల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు  రియంబర్స్మెంట్ తదితర పథకాలు అమలు చేసి బడుగు బలహీన వర్గాల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరిచిపోలేని నాయకుడు అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.