సమ్మక్క-సారక్క గిరిజన జాతర భక్తి శ్రద్ధలకు ప్రతీక !

👉 జాతరను విశ్వస్థాయిలో గుర్తింపు పొందేలా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యం !

👉 జాతర నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి  ₹150 కోట్లు కేటాయింపు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

సమ్మక్క-సారక్క గిరిజన జాతర భక్తిశ్రద్ధలకు ప్రతీక అని, జాతరను విశ్వస్థాయిలో గుర్తింపు పొందేలా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యం  అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

సోమవారం జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నివాసంలో సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లు కు సంబంధించి సమీక్ష సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నట్టు మంత్రి వివరించారు.

👉 సమావేశం అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…

సమ్మక్క-సారక్క జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఆసియాలో అతిపెద్ద జాతర కాబట్టి  రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి అన్నారు.
ఈ జాతర నిర్వహణకు సీఎం  చూపుతున్న ఆసక్తి, రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ దృక్పథానికి నిదర్శనం అని మంత్రి అన్నారు.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా  ఏర్పాట్లు చేస్తాం, ముఖ్యమంత్రి మంజూరు చేసిన ₹150 కోట్లు జాతర ప్రతిష్టను  దశ దిశల వ్యాపించేలా నిర్వహణకు సీఎం కోట్లాది నిధులు కేటాయించడం పట్ల అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

👉 ప్రధానంగా సదుపాయాలు !

జాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే దృష్ట్యా శుద్ధమైన తాగునీరు, విద్యుత్, రవాణా, వైద్యశిబిరాలు, శానిటేషన్ వంటి అన్ని ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని సమీక్ష సమావేశంలో సీఎం  అధికారులను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు.

ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేక రవాణా ప్రణాళిక, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటుచేయనున్నారు.
భద్రతా చర్యలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసుల ప్రత్యేక బందోబస్తు, సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.

విపత్తు నిర్వహణ దళాలు, అగ్నిమాపక సిబ్బంది 24 గంటలు సిద్ధంగా ఉంటారు ఆధ్యాత్మిక–సాంస్కృతిక వైభవం యునెస్కో గుర్తింపు పొందిన ఈ మహా జాతరలో ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతిక వైభవం ప్రతిఫలిస్తాయి అని ప్రత్యేకంగా ప్రభుత్వం ఈ జాతర ద్వారా ఆధ్యాత్మికతతో పాటు గిరిజనుల సాంప్రదాయాలు, సంస్కృతిని దేశానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది మంత్రి అన్నారు.

తాత్కాలిక ఏర్పాట్లతో పాటు, భక్తులకు ప్రతిసారి సౌకర్యాలు అందేలా శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.