👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రాహ్మణ అగ్రహారం ధర్మపురి క్షేత్రంలో సోమవారం నుండి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న దసరా నవరాత్రి ఉత్సవాలను ఆలయ సాంప్రదాయ ప్రకారం, వేద పండితులు, అర్చక స్వాములు వివరించిన పద్ధతిలోనే ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు1.
👉 ఆదివారం ధర్మపురిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆలయ ముఖ్య అర్చకులు, శ్రీనివాస శర్మ, రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకుడు ప్రవీణ్ శాస్త్రి, ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, ఆలయ పాలకవర్గ చైర్మన్ జక్కు రవీందర్, సిబ్బందితో మంత్రి సమీక్షా నిర్వహించారు.

👉 పూర్ణాహుతి రోజున వేద పండితులకు నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి మొత్తం ఖర్చును నేను వ్యక్తిగతంగా భరిస్తాను, ఒకరోజు ముందు నా నెల జీతం చెక్ ను మీకు అందిస్తానని కార్యనిర్వహణాధికారికి తెలిపారు.
👉 మొదటి రోజు జరుగు పూజా కార్యక్రమాల ఖర్చును నేనే భరిస్తాను వాటి ఖర్చు వివరాలను చెప్పండి అని మంత్రి అన్నారు.
👉 పూజాది కార్యక్రమాల నిర్వహణ, సమయపాలన, సాంప్రదాయ పద్ధతిలో, స్థానిక వేద పండితులు, ఆలయ అర్చకులు, వివరించిన పద్ధతిలోనే చేయాలని, పూజల నిర్వహణ తీరుతెన్నులలో భక్తుల అభిప్రాయాలకు, ఆలోచనలతో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించాలని, మంత్రులు, విఐపి ల కోసం, వేచి ఉండే పద్ధతికి స్వస్తి చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేకంగా ఆలయ అర్చకులు కార్యనిర్మాణాధికారి, పాలకవర్గ చైర్మన్ ను కోరారు.