స్కందమాత రూపంలో అమ్మవారు – దర్శించుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

దసరా నవరాత్రి ఉత్సవాలలో  భాగంగా ఐదవ రోజు శుక్రవారం అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది సాయంత్రం రామలింగేశ్వర స్వామి ఆలయంలోని అమ్మవారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ప్రధాన దేవాలయముతో పాటు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అనుబంధ ఆలయాలలో విశ్వక్షేన పూజలు, దీపారాదనలు జరిగాయి.


వేదపండితులు, ఋత్వికులచే మహ సంకల్పము, పృద్వీకలశ, గణపతి పూజ, స్వస్తిః పుణ్యహ వచనము, ఋత్విక్ వర్ణణము, అఖండ దీప స్థాపన, నవగ్రహ, వాస్తు, క్షేత్ర పాలక, యోగిని, అంకురారోపణ, మాతృక, సర్వతోభద్ర మండల పూజలు జరిగాయి
.

ఇందులో భాగంగా సప్తశతీ పారాయణము, అమ్మ వారికి చతుషష్టి పూజ, శ్రీచక్రమునకు కుంకుమార్చన, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణలు జరిగినవి మరియు ఐదు(5)ఋత్వికులచే “చండీపారాయణం” & “దేవిభాగవత పారాయణం”, కన్యకా, సువాసిని పూజలు జరిగాయి.

అమ్మ వారు “స్కందమాత రూపములలో పసుపు రంగు చీరలో మల్లెపూలు, బిల్వపత్రి దండలు దరించి భక్తులకు దర్శనం ఇచ్చింది  మహిళలచే కుంకుమార్చన పూజలు శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయములో జరిగాయి.

నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అనుబంధ దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కి  వార్షిక క్షీరాభిషేకం పంచోపనిషత్తులు లక్ష్మీ అష్టోత్తరంతో అత్యంత వైభవంగా అర్చకులచే నిర్వహించబడినది


తదుపరి శ్రీ స్వామివారికి హారతి మంత్రపుష్పం ఇచ్చిన తదుపరి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ  చేశారు.

పట్టణంలోని మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గా దేవి అమ్మవారిని  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు..

ఈ సందర్భంగా అర్చకులు నిర్వాహకులు మంత్రికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా వందలాదిమంది మహిళా భక్తులు దేవి మండపంలో కుంకుమ పూజలు చేశారు.