ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోద సభలో కెసిఆర్ లేడు !

👉 మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కొన్ని గంటల సమయంలో ఎస్సీవర్గీకరణ బిల్లుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసి, చట్టం చేసి, అమలు పర్చాలని నిర్ణయం తీసుకున్నారు, అని
ఎస్సీ వర్గీకరణ  సమయంలో కూడా ప్రతిపక్ష నేత  కెసిఆర్ సభకు హాజరు కాలేదని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అన్నారు.

సిరిసిల్ల పట్టణంలో మంగళవారం రాత్రి జరిగిన మాదిగల ఆత్మీయ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

👉 ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అడ్లూరి కామెంట్స్…..

గత ప్రభుత్వ హయాంలో కేసి రావు, రావు కేటి రావు,ఆర్ సంతోష్ రావు, హరీష్ రావు, రావుల రాజ్యం లో దళితులపై దాడులు జరిగాయని ఆరోపించారు.

👉 నేరెళ్ళ సంఘటన అంశంలో సంసార జీవనానికి, బ్రతుకు జీవనానికి  పనికిరాకుండా తీవ్రంగా హింసకు గురి అయిన బాధితుల దారుణ దుస్థితిని చూసి మానసిక వేదనకు గురి అవుతున్నాను అన్నారు.

👉 పేద, అట్టడుగు వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. బలహీన వర్గాల కు 42 శాతం రిజర్వేషన్ చేసి పేదల పక్షపాతి ప్రభుత్వంగా నిరూపించుకున్నాం అన్నారు

👉 సిరిసిల్ల జిల్లాలో దళితులకు చెందాల్సిన భూమి, వారికే చెందేలా వందశాతం కృషి చేస్తా. మా తాతలు, తండ్రుల నుండి కాంగ్రెస్ పార్టీ నే అంటిపెట్టుకుని ఉన్నాం.

👉 ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం వేయి కోట్లు ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం.

👉 గత ప్రభుత్వ పాలకులు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువు తోవిజ్ఞానం పొందుతే తమ పాలనను  ప్రశ్నిస్తారు, నిలదీస్తారు అనే ఆలోచనతోనే  విద్యను, ఉస్మానియా యూనివర్సిటీ పట్టించుకోలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.