J.SURENDER KUMAR,
సెప్టెంబర్ 17న రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో (హైదరాబాద్ మినహా) జాతీయ పతాకాన్ని అధికారికంగా ఎగురవేయడానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు,
ఉత్తర్వు సంఖ్య ఆర్.టి. నెం: 1235 సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సెప్టెంబర్ 17న “తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం” గా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో, ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరిస్తారు.
👉 జిల్లాలలో…
“తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం” సందర్భంగా, ప్రతి జిల్లాలో మంత్రులు, ప్రముఖులు ఉదయం 10:00 గంటలకు జిల్లా కేంద్రాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరిస్తారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు మరియు గ్రామ పంచాయతీలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.

👉 ఆదిలాబాద్, మహ్మద్ అలీ షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారు
👉 భద్రాద్రి కొత్తగూడెం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు !
👉 వరంగల్, మంత్రి కొండా సురేఖ,
👉 జగిత్యాల , నిరంజన్, ఛైర్మన్, తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ !
👉 జయశంకర్ భూపాలపల్లి, బెల్లయ్య నాయక్, ఛైర్మన్, తెలంగాణ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్
👉 జనగామ , బీర్ల ఐల్లయ్య, ప్రభుత్వ విప్
👉 జోగులాంబ గద్వాల , ఎ.పి. జితేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రతినిధి మరియు ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు)
👉 కామారెడ్డి , ఎం. కోదండ రెడ్డి, ఛైర్మన్, తెలంగాణ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ కమిషన్.
👉 కరీంనగర్, మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్,
👉 ఖమ్మం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
👉 కొమురంభీం ఆసిఫాబాద్ , బండ ప్రకాష్, డిప్యూటీ ఛైర్మన్, తెలంగాణ శాసన మండలి.
👉 మహబూబాబాద్ , జె. రాంచందర్ నాయక్, విప్, తెలంగాణ శాసనసభ
👉 మహబూబ్‌నగర్ , మంత్రి జూపల్లి కృష్ణారావు.
👉 మంచిర్యాల , హరకార వేణుగోపాల్ రావు, ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్ & పౌర సంబంధాలు)
👉 మెదక్ , మంత్రి జి. వివేక్ వెంకటస్వామి,
👉 మేడ్చల్ , కె. కేశవ రావు, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)
👉 ములుగు , మంత్రి డి. అనసూయ సీతక్క.
👉 నాగర్‌కర్నూల్ , జి. చిన్నారెడ్డి, వైస్-ఛైర్మన్, ప్రణాళికా సంఘం.
👉 నల్గొండ , మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి .
👉 నారాయణపేట, మంత్రి వాకిటి శ్రీహరి.
👉 నిర్మల్ , రాజయ్య సిరిసిల్ల, ఛైర్‌పర్సన్, తెలంగాణ ఆర్థిక సంఘం.
👉 నిజామాబాద్, వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు)
👉 23 పెద్దపల్లి, మొహ్మద్ ఒబేదుల్లా కొత్వాల్ సాహెబ్, ఛైర్మన్, తెలంగాణ మైనారిటీల ఆర్థిక కార్పొరేషన్.
👉 రాజన్న సిరిసిల్ల ఆది శ్రీనివాస్, విప్, తెలంగాణ శాసనసభ.
👉 రంగారెడ్డి , మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
👉 సంగారెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ,
👉 సిద్దిపేట, మంత్రి పొన్నం ప్రభాకర్.
👉 28 సూర్యాపేట,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
👉 వికారాబాద్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
👉 వనపర్తి , పట్నం మహేందర్ రెడ్డి, చీఫ్ విప్, తెలంగాణ శాసన మండలి.
👉 హనుమకొండ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
👉 యాదాద్రి భువనగిరి, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి.
రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకొని, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి అని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్నారు.