స్థానిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి !

👉 జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ !

J.SURENDER KUMAR,

ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ నిబంధనలు పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.

శుక్రవారం మెట్టుపెల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన జడ్పిటిసి, ఎంపిటిసి   ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

👉 కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…

ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అన్నారు. అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. 

ఎన్నికల నిర్వహణలో ఏవైనా అనుమానాలు, ఇబ్బందులు ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఓటర్లకు ఇబ్బంది రాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద సరిపడా స్ట్రాంగ్ రూములు, బ్యాలెట్ బాక్సులు, తాగునీరు, మరుగుదొడ్లు, వీల్ చైర్లు తదితర సౌకర్యాలతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఎన్నికల వేళ పొరపాట్లకు తావివ్వకుండా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ  పారదర్శకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. 

👉 స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్ మాట్లాడుతూ.….

హ్యాండ్ బుక్ లో ఉన్న నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సందేహాలు నివృత్తి చేసుకొని ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా కృషి చేయాలన్నారు. చెక్ లిస్ట్ తయారు చేసుకుని నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో, మాస్టర్ ట్రైనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.