స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాలు !

👉 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు నిర్వహణ !

J SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో స్వస్థ్ నారి స్వశక్తి పరివార్ అభియాన్ పై జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో  కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహిళల ఆరోగ్యం కోసం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2తేదీ వరకు స్వస్థ్ నారి స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు.

👉 పోషణ మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ బి. సత్యప్రసాద్

సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు నిర్వహించు పోషణ మహోత్సవం కార్యక్రమంలో
పౌష్టికాహార లోపాన్ని పిల్లలలో గర్భిణీలలో బాలింతలలో నివారించడం మరియు రక్తహీనతను తగ్గించడం మరియు ధైర్య మంచినీరు పరిశుభ్రత పారిశుధ్యం పౌష్టికాహారం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేలా పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

వోకల్ ఫర్ లోకల్” నినాదంతో గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించి చిన్నపిల్లలకు మెరుగైన ఆహారపు అలవాట్లుఅలవర్చే విధంగా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎం సి హెచ్ సూపరింటెండెంట్ కృష్ణ మూర్తి, జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, డిడబ్ల్యూవో నరేష్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.