J SURENDER KUMAR,
తిరుమల శ్రీవారికి విశాఖపట్నం చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజ్ ఎండీ పువ్వాడ మస్తాన్ రావు, శ్రీమతి కుంకుమ రేఖ దంపతులు ₹ 3.86 కోట్లు విలువైన బంగారు యజ్ఞోపవీతంను బుధవారం విరాళంగా అందించారు.
వజ్రాలతో పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం 3.860 కేజీల బంగారంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడింది. ఈ మేరకు దాతలు ఈ కానుకను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు అందించారు.

ఈ సందర్భంగా చైర్మన్ దాతలను అభినందించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారామ్ తదితరులు పాల్గొన్నారు.