J.SURENDER KUMAR,
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో కలిసి పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్ విజయవంతంగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆయనను కలిసి పార్టీ అంతర్గత విషయాలు చర్చించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ పేద, బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, గౌడ్ నాయకత్వం తో పార్టీకి కొత్త జోష్ వచ్చిందన్నారు. రైతు రుణమాఫీ, ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ, మహిళా చైతన్యం, యువశక్తి, గురుకులాల అభివృద్ధి వంటి పథకాల ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నామని మంత్రి అన్నారు.
సమానత్వ సమాజ నిర్మాణమే కాంగ్రెస్ లక్ష్యం అని, గాంధీజీ సిద్ధాంతాలను ఆచరణలో పెడుతూ ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతోందని, అభివృద్ధి సంక్షేమం రెండూ కాంగ్రెస్ పాలనకు రెండు కళ్ళలాంటివని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ విధానమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 పీసీసీ చీఫ్‌తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భేటీ !
జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మంత్రి లక్ష్మణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ను ఆయన స్వగ్రామంలో కలసి భేటీ అయ్యారు.
ఈసందర్భంగా జగిత్యాల జిల్లాలో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహరచన పై చర్చించారు.
పార్టీ పథకాలను గ్రామస్థాయిలో ప్రతి ఇంటికి చేరేలా చర్యలు, గ్రామ , పట్టణ స్థాయి కార్యకర్తలకు శిక్షణ, బూత్ కమిటీల పునర్వ్యవస్థీకరణ, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఏర్పాటు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్ వంటి విభాగాలను మరింత చురుకుగా మార్చే అంశాలపై నిర్ణయాలు భేటీ జరిగింది.
జిల్లాలో పార్టీ ఐక్యతను పెంపొందించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని పీసీసీ చీఫ్ సూచించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పర్యటనలు చేపట్టాలని కూడా ఈ భేటీ లో నిర్ణయించారు.