ట్రంపెట్ ఇంటర్‌చేంజ్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

J.SURENDER KUMAR,

హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ (HMDA) కోకాపేట వద్ద నిర్మించిన ట్రంపెట్ ఇంటర్‌చేంజ్‌ను సోమవారం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కోకాపేట నియోపోలీస్ ఓఆర్ఆర్ (ఎగ్జిట్ 1A) వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

👉 ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

👉 కోకాపేట నియో పోలీస్ లేఅవుట్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ చేసే ఈ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ వల్ల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి సౌకర్యవంతంగా మారడమే కాకుండా చాలా సమయం ఆదా కానున్నది.